ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ జోహార్ మూవీలో గెస్ట్ రోల్ పోషించడానికి ఎవరూ ముందుకు రాలేదని తెలిపారు. సినిమాలో సల్మాన్ ఎంపిక ఒక ఆసక్తికరమైన అంశం. అమన్ క్యారెక్టర్ చేయమని చాలామందిని అడిగాను.. స్టోరీ సగం కూడా వినకుండానే రిజెక్ట్ చేశారు. దీంతో చివరగా సల్మాన్‌ను కలిశాను.విషయం చెప్పగానే ఆయన ఒక మాట అన్నాడు. ఆత్మవిశ్వాసం ఉన్న నటుడే ఇలాంటి పాత్రలో నటించగలడు. ఇది నేను చేస్తున్నాను అని డైరెక్ట్ గా ఒప్పేసుకున్నాడు. అప్పటి నుంచి సల్మాన్ అంటే నాకు చెప్పలేనంత ప్రేమ, గౌరవం అంటూ తెగ పొగిడేశాడు కరణ్ జోహార్.ఇకపోతే కరణ్ జోహార్ విషయానికి వస్తే.. కరణ్ జోహార్ నిర్మాతగా తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే. తరచూ ఎదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. సినిమాలకు సంబంధించిన విషయాలకంటే ఎక్కువగా కాంట్రవర్సీలకు సంబంధించిన విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి