సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం చిత్రం పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలలో కూడా నాగవంశీ ఈ సినిమా గురించి చేసిన కామెంట్స్ ఈ సినిమా పైన భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో గుంటూరు కారం సినిమాని రిలీజ్ చేయబోతున్నామని ఇది వరకే చిత్ర బృందం ప్రకటించడం జరిగింది. దీంతో గుంటూరు కారం సినిమా అప్డేట్ల పైన పలు రకాల వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.


త్వరలోనే గుంటూరు కారం సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయబోతున్నారు.. ఇదంతా ఇలా ఉండగా గుంటూరు కారం సినిమా మొదటి సాంగ్ అంటూ ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది. గుంటూరు కారం సాంగ్ లీకైనట్లుగా పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.. సినిమా అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ లీక్ అయిన సాంగ్ తెగ వైరల్ గా మారుతున్నది. ఈ చిత్రానికి సంగీతాన్ని తమన్ అందిస్తూ ఉన్నారు.

మహేష్ బాబు నటించిన దూకుడు ,ఆగడు ,బిజినెస్ మాన్, సర్కారు వారి పాట చిత్రాలకు సైతం సంగీతాన్ని తమన్ అందించారు. ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి కూడా తమన్ అందిస్తూ ఉండడం గమనార్హం. అంతేకాకుండా ఈ సినిమా నుంచి లీకైన సాంగ్ పైన అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు కొంతమంది సాంగ్ బాగుందని అంటూ ఉండగా మరి కొంతమంది రాడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఇది ఒరిజినల్ సాంగ్ కాదంటూ తెలుపుతున్నారు. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తూ ఉండగా మరొక హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: