కాగా ఈవీవీ సత్యనారాయణ సినిమాల్లో ఇలాంటి క్రేజీ ఐడియాలతో చాలా టైటిల్ కార్డ్స్ వచ్చాయి. అప్పటిలో ఈవీవీ చిత్రాల టైటిల్ కార్డ్స్ కి ఒక ప్రత్యేకత ఉండేది. నటీనటులు, టెక్నీషియన్స్ పేరులు వేయడానికికి బదులు వారితోనే వారి పేర్లు చెప్పించడం, పేరడీ పద్ధతిలో టైటిల్స్ వేయడం.. ఆడియన్స్ ని ఆకట్టుకునేవి. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఈ టైటిల్ కార్డ్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి.ఈవీవీ టైటిల్ కార్డు పద్దతిని ఇప్పటి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా కొన్నాళ్ళు అనుసరించారు. నాన్నకు ప్రేమతో సినిమా వరకు సుకుమార్.. తన మూవీ టైటిల్ కార్డ్స్ ని ప్రత్యేకంగా డిజైన్ చేయిస్తూ వచ్చారు. సినిమా కాన్సెప్ట్ ని ఆ టైటిల్ కార్డులో చూపించేవారు. కానీ రంగస్థలం, పుష్పలో ఆ స్టైల్ ఆఫ్ టైటిల్ కార్డు మిస్ అయ్యింది
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి