దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని సూపర్ క్రేజీ ను సంపాదించుకున్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగా ఒకరు. ఈయన విజయ్ దేవరకొండ హీరోగా శాలిని పాండే హీరోయిన్ గా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా ఈ సినిమా తెలుగు లో సూపర్ సక్సెస్ కావడంతో ఈయన ఇదే సినిమాని షాహిద్ కపూర్ హీరోగా హిందీ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించింది.

ఇకపోతే తాజాగా ఈ దర్శకుడు యానిమల్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ డిసెంబర్ 1 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు రన్బీర్ కపూర్ హీరోగా నటించగా ... రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ దర్శకుడు సందీప్ వరస ఇంటర్వ్యూ లలో ... ప్రెస్ మీట్ లలో పాల్గొంటూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో భాగంగా సందీప్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పకచ్చాడు.

తాజా ఇంటర్వ్యూ లలో భాగంగా సందీప్ కి మీరు మహేష్ కు కొంత కాలం క్రితం ఓ కథ చెప్పాను అని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు వాస్తవమేనా ..?  ఆ కథ యానిమల్ మూవీ కథ ఒకటేనా అనే ప్రశ్న సందీప్ కి ఎదురయింది. దీనికి సందీప్ సమాధానం ఇస్తూ ... మహేష్ కు కథ చెప్పిన మాట వాస్తవం. కానీ అది యానిమల్ మూవీ కథ కాదు. దాని పేరు డేవిల్ అని చెప్పాడు. ఇక ఆ తర్వాత యానిమల్ మూవీ లో రన్బీర్ పాత్ర ఉన్నంత వైలెంట్ గానే మహేష్ పాత్ర కూడా ఉంటుందా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానం ఇస్తూ ఇంతకంటే డబుల్ వైలెంట్ గా ఆ పాత్ర ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: