తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 12 వారాల ఆట ముగిసింది. ప్రస్తుతం 13 వ వారం పాట కొనసాగుతుంది. ఇకపోతే 13 వ వారం ఇంటి నుండి బయటకు వెళ్లడానికి సంబంధించి బిగ్ బాస్ నామినేషన్ ల ప్రక్రియను నిర్వహించాడు. ఇక ఈ ప్రక్రియ ప్రతి వారం జరిగినట్లు గానే చాలా రసవత్తరంగా జరిగింది. అందులో భాగంగా కంటెస్టెంట్ లు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మొత్తం ప్రాసెస్ లో ఒక అమర్ దీప్ తప్ప అందరూ ఈ వారం నామినేషన్ లలో ఉన్నారు.

ఇకపోతే ప్రస్తుతం హౌస్ లో కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు వచ్చే వారం హౌస్ నుండి ఎలిమినేట్ కాబోతున్నారు. ఇక ఈవారం నామినేషన్ లిస్ట్ లో ప్రశాంత్ , శివాజీ , ప్రిన్స్ , అర్జున్ , శోభ , ప్రియాంక , గౌతమ్ లు ఉన్నారు. ఇక వీరిలో పల్లవి ప్రశాంత్ , శివాజీ , ప్రిన్స్ మొదటి నుండి అదిరిపోయే రేంజ్ ఓటింగ్ ను సాధిస్తూ ఫుల్ జోష్ లో ముందుకు సాగుతున్నారు. ఇక దానితో ఈ వారం కూడా వీరిలో ఎవరు కూడా హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఏ మాత్రం లేవు. ఇకపోతే అర్జున్ , శోభ , ప్రియాంక , గౌతమ్ వీరు నలుగురు మొదటి నుండి ఎప్పుడు ఎలిమినేషన్ లిస్టు లో ఉన్న చాలా తక్కువ శాతం ఓటింగ్ లు తెచ్చుకుంటూ ఎలిమినేట్ కాకుండా బయట పడుతున్నారు.

ఇకపోతే ఈ వారం వీరు నలుగురు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇందులో నుండి ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ వారం అత్యధిక మంది హౌస్ మేట్స్ పల్లవి ప్రశాంత్ మరియు శివాజీ ని నామినేట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: