తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన రాజా వారు రాణి గారు మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత నుండి ఈయన వరుస సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను పలకరిస్తూ వస్తున్నప్పటికీ అందులో కొన్ని మూవీ లు మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ నటుడు రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందిన రూల్స్ రంజన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 6 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. 

పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి ఆహా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని నవంబర్ 30 వ తేదీ నుండి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: