
''ఇన్ని సినిమాల మధ్యలో వస్తున్నా.. 'హాయ్ నాన్న' మీ అందరి మనసులో నిలిచిపోయేలా ఉంటుంది. ఇది మీరు అనుకున్నట్లు ఎమోషనల్ ఫిల్మ్ కాదు. శౌర్యువ్‌లాంటి కొత్త దర్శకులతో పనిచేయడం గర్వంగా అనిపిస్తుంది. అతడు భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా. హేషబ్ అద్భుతమైన సంగీతం అందించాడు. జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ కట్టిపడేస్తుంది. సినిమాలో ఇంకా ఎన్నో సర్‌ప్రైజ్‌లున్నాయి'' అంటూ అభిమానుల్లో జోష్ నింపారు. ''గతంలో 'సీతారామం' సినిమా ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చా. ఇప్పుడు 'హాయ్ నాన్న'తో మరోసారి మీ అందరి ముందుకొచ్చా. తెలుగు అమ్మాయిలా నన్ను స్వీకరించినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నాని బెస్ట్ కో- యాక్టర్. బేబీ కియారా పెర్ఫామెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ తండ్రీ కూతుళ్ల కథతో మీరు ప్రేమలోపడతారు. అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా'' అంటూ సినిమాపై మృణాల్ ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నటులు ప్రియదర్శి, విరాజ్ అశ్విన్, బేబీ కియారా తదితరులు పాల్గొన్నారు.