మహేష్ బాబు ... అల్లు అర్జున్ ... జూనియర్ ఎన్టీఆర్ ... రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న సినిమాలు ప్రస్తుతం చిత్రీకరణ దశల్లో ఉన్నాయి. వీరు ప్రస్తుతం ఏ సినిమాలలో నటిస్తున్నారు . ఆ మూవీ లకు సంబంధించిన చిత్రీకరణ ప్రస్తుతం ఏ ప్రాంతం లో జరుగుతుంది అనే విషయాలను తెలుసుకుందాం .

టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా లో హీరోగా నటిస్తున్నాడు . ఈ మూవీ లో శ్రీ లీలా ... మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు . ప్రస్తుతం ఈ మూవీ బృందం అన్నపూర్ణ స్టూడియోలో మహేష్ బాబు ... మీనాక్షి చౌదరి పై సాంగ్ ను షూట్ చేస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ఇకపోతే ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం అల్లు అర్జున్ మరియు కొంత మంది ఇతరులపై ఖైరతాబాద్ లో ఈ సినిమా చిత్రీకరణను తెరకెక్కిస్తున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ మరియు కొంత మంది ఇతరులపై ఈ సినిమా షూటింగ్ ను తెరకెక్కిస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం రామ్ చరణ్ మరియు కొంత మంది ఇతరుల పై మైసూర్ లో ఈ సినిమా చిత్రీకరణ ను తెరకెక్కిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: