
అడపాదడపా సినిమాలలో నటిస్తున్న సురేఖవాణి సోషల్ మీడియాలో తన కూతురుతో కలిసి యాక్టివ్ గా ఉంటూ నానా రచ్చ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తల్లి కూతుర్లు ఇద్దరు కూడా డాన్స్ రీల్స్ చేస్తు పెద్ద ఎత్తున వైరల్ గా మారుతూ ఉంటారు. తరచూ మోడ్రన్ దుస్తులలో కుర్రకారులకు సైతం చెమటలు పట్టించేలా చేస్తూ ఉంటారు. సురేఖ వాణి నాలుగుపదుల వయసులో కూడా తన కూతుర్ని మించిపోయి మరి అందంగా కనిపిస్తూ అందచందాలను వలకబోస్తూ ఉంటుంది.
తాజాగా సురేఖ వాణి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేయడం జరిగింది.ఇందులో భాగంగా మగవాళ్ళ బుద్ధి గురించి ఆమె ఒక వీడియోని తెలియజేయడం జరిగింది. అది కాస్త వైరల్ గా మారడంతో మగవాళ్ళందరూ కూడా మనమల్ని రీచ్ అయ్యేవరకు ఒక రాగా ఉంటారు..రీచ్ అయిన తర్వాత అందరూ ఒకే లాగా మారుతారు అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో పైన పలు రకాలుగా కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి.. దీంతో పలువురు నెటిజన్స్ మేడం మిమ్మల్ని ఎవరు రీచ్ అయ్యారు అంటూ సురేఖ వానికి కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు.. మరి కొంతమంది ఎవరో బాగా హర్ట్ చేసినట్టున్నారు అందుకే ఇలా కామెంట్స్ చేస్తున్నారంటూ తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతున్నది.