తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు అల్లు అరవింద్.. అంతేకాకుండా ఆహా ఛానల్ అధినేత ఓనర్ గా కూడా మరింత క్రేజ్ ని అందుకోవడం జరిగింది. ఒకవైపు తన బ్యానర్ పైన బడా సినిమాలను సైతం విడుదల చేస్తూ మరింత క్రేజ్ అందుకున్న అల్లు అరవింద్ ఎంతోమంది యంగ్ దర్శకులను కొత్త నటీనటులను సైతం ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే డైరెక్టర్లతో ఏదైనా సినిమా తెరకెక్కించేటప్పుడు ఖచ్చితంగా వారితో రెండు మూడు సినిమాలను తెరకెక్కించే విధంగా అగ్రిమెంట్ను రాపించుకొని మరి డైరెక్టర్లను లాక్ చేసుకుంటూ ఉంటారు.


గీత ఆర్ట్స్ బ్యానర్ పైన ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. ఇతర నిర్మాణ సంస్థలు సైతం నాగచైతన్యతో సినిమాలు చేయడానికి కాస్త వెనక్కి తగ్గుతున్నప్పటికీ.. డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో సినిమాల పైన నమ్మకాన్ని ఉంచి తండేల్ అనే చిత్రాన్ని భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ వారు నిర్మిస్తూ ఉన్నారు.. గతంలో కూడా ఈ బ్యానర్ పైన పలు రకాల సమస్యల వల్ల బడా ప్రాజెక్టులను సైతం నిలిపివేసినట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా డిజిటల్ డబ్బింగ్ హక్కులను కూడా కొన్ని కారణాల చేత తీసుకోలేదట.


కానీ నాగచైతన్యతో సినిమా చేయడానికి మాత్రం దాదాపుగా 70 కోట్ల బడ్జెట్ని పెట్టడానికి సిద్ధమయ్యింది ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తూ ఉన్నది. నాగచైతన్య నటించిన గత రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కేవలం డైరెక్టర్ చందు మొండేటి నమ్మకం వల్లే ఇంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ముందుకు తీసుకువెళ్తున్నారని అలాగే సాయి పల్లవి పైన ఉన్న నమ్మకంతోనే ఈ చిత్రం ఇంత భారీ బడ్జెట్ గా తెరకెక్కిస్తున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏ మేరకు అల్లు అరవింద్ నమ్మకాన్ని సైతం చిత్ర బృందం నిలబెట్టుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: