త్రిబుల్ ఆర్ వంటి సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అప్పటివరకు టాలీవుడ్ స్టార్ హీరోగా ఉన్న రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో ఆయన గుర్తింపును పది రెట్లకు పెంచుకున్నాడు. దాంతో తన ఇమేజ్ తో పాటు బ్రాండ్ వాల్యూ కూడా భారీగా పెరిగింది. అయితే తాజాగా బాలీవుడ్ గోల్డెన్ స్టార్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డుని సైతం దక్కించుకున్నాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. దీంతో రామ్ చరణ్ గురించి మరింత వివరాలను తెలుసుకోవడానికి చాలామంది సినీ లవర్స్ అందరూ ఆరా తీస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఆయన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఆస్తులు ఇలా అన్నిటి గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ కి సంబంధించిన ఆస్తి వివరాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న నేటి తరం టాప్ హీరో లలో రామ్ చరణ్ రిచేస్ట్ హీరో అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ హీరో గానే కాకుండా నిర్మాతగా వ్యాపారవేత్తగా కూడా బిజీగా ఉంటూ ఉంటాడు. ఇక అర్ అర్ అర్  సినిమా తర్వాత ఒక్కొక్క సినిమాకి గాను దాదాపు 100 కోట్లకు

పైగానే రెమ్యూనరేషన్ సైతం డిమాండ్ చేస్తున్నాడు రామ్ చరణ్. వాణిజ్య ప్రకటనలతో భారీగా ఆర్జిస్తున్నాడు. వోలానో, అపోలో జియా, హీరో మోటోక్రాప్, ఫ్రూటీ, పెప్సీ, టాటా డొకోమో.. ఇలా దాదాపు 34 బ్రాండ్‌లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. కేవలం బ్రాండ్స్ ద్వారా చరణ్ నెలకు రూ. 3 కోట్లకు పైగా సంపాదిస్తాడని సమచారం. అంతేకాకుండా ఇప్పుడు తాజాగా అందుతున సమాచారం మేరకు రామ్ చరణ్ ఆస్తుల విలువ రూ. 1370 కోట్లు అని తెలుస్తోంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో రామ్ చరణ్‌కు రూ. 38 కోట్లు విలువ చేసే ఓ విలాసవంతమైన బంగ్లా ఉంది. అలాగే హైదారబాద్ తో పాటు చెన్నై, ముంబై నగరాల్లో లగ్జరీ ఫ్లాట్స్, ఖరీదైన ప్రోపర్టీస్ ఉన్నాయి.  ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. దాంతో పాటు రామ్ చరణ్ కి ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: