ఇక రీసెంట్ గా విడుదలైన రెండవ పాట 'ఓ మై బేబీ' పాటకి యూట్యూబ్ లో యాడ్స్ పెట్టలేదు. అందువల్ల ఈ పాటకి కేవలం 27 లక్షల వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఇది ఒక స్టార్ హీరో సినిమా పాట కి చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ అనే చెప్పాలి. మీడియం రేంజ్ హీరో సినిమా పాటలకు కూడా మినిమం మూడు మిలియన్ వ్యూస్ వస్తున్నా ఈరోజుల్లో మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పాటకి ఇంత తక్కువ వ్యూస్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. ఈ పాట విడుదలైనప్పుడే థమన్ పై మహేష్ బాబు ఫ్యాన్స్ ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు.ఒక క్రేజీ కాంబినేషన్ లో వచ్చే సినిమాకి కంపోజ్ చెయ్యాల్సిన పాట ఇదేనా?, నీకు చేతకాకపోతే సినిమా నుండి తప్పుకోవచ్చు కదా అని థమన్ ని ఇష్టమొచ్చినట్టు తిట్టేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. ఇకపోతే నిన్న ఈ పాట విడుదలైన సమయం లోనే ప్రభాస్ 'సలార్' చిత్రం నుండి 'సూరీడు' అనే పాట విడుదలైంది. ఈ పాటకి మంచి రెస్పాన్స్ రావడమే కాదు, యూట్యూబ్ లో 24 గంటల్లో 5 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి