యానిమల్ మూవీ తో రణబీర్ కి సౌత్ లోనూ భారీ క్రేజ్ ఏర్పడడంతో ఈ హీరో నటించే తదుపరి సినిమాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. యానిమల్ తర్వాత రణ్ బీర్ 'రామాయణం' సినిమాలో నటించనున్నాడు. బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ నితీష్ తివారి మహా ఇతిహాసం రామాయణం ఆధారంగా ఈ సినిమాని గ్రాండ్ స్కేల్లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో శ్రీరాముడిగా రణ్ బీర్ కపూర్, సీతాదేవిగా సౌత్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. 'కేజిఎఫ్' హీరో యశ్ ఇందులో రావణుడి పాత్రను పోషించబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ బయటికి వచ్చింది. 2024 మార్చిలో రామాయణం షూటింగ్ మొదలవుతుందని 

మూవీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. యానిమల్ తర్వాత కొంత బ్రేక్ తీసుకుంటున్న రణ్ బీర్ మార్చ్ లో ఈ మూవీ షూటింగ్ కి వెళతారని సమాచారం. కేజిఎఫ్ హీరో యశ్ మాత్రం 2024 జూలైలో రామాయణం షూటింగ్లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో 'టాక్సిక్' అనే మూవీ చేస్తున్న యశ్ ఈ మూవీ షూటింగ్ పూర్తి చేశాకే రామాయణం సెట్స్ లో అడుగుపెట్టనున్నారట. కాగా రామాయణం పార్ట్ వన్ లో యశ్ కనిపించేది కొద్ది సమయం మాత్రమేనని, పార్ట్ 2 మొత్తం రావణుడిగా యష్ పాత్ర పైనే కథ నడుస్తుందని అంటున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ VFX కంపెనీ DNED పనిచేస్తోంది. ఈ మూవీ కోసం సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నారు. 

ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి రణ్ బీర్, సాయి పల్లవి, యశ్ ల 3D స్కాన్ లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ప్రాజెక్టు మూడు భాగాలుగా వస్తోంది. 2025లో రామాయణ : పార్ట్ వన్ ని రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ చిత్రంలో హనుమంతుడి పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సన్నీ లియోన్ మూవీ టీం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతనితో టీం చర్చలు జరుపుతోందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే బాలీవుడ్ నుంచి రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' సినిమా వచ్చింది. ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ అందుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: