తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ మంచి సినిమాలను చేస్తూ ముందుకు కదులుతూ ఉంటారు.ఇక అందులో భాగంగానే దర్శకధీరుడు అయిన రాజమౌళి కూడా మంచి సినిమాలను చేయాలనే ఉద్దేశ్యం లో చాలా ఎక్కువ రోజులు తీసుకొని మరి ఒక మంచి సినిమాని ప్రేక్షకుడికి అందిస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలో ఈయన మొదట ఈగ సినిమా ని రెండున్నర కోట్ల బడ్జెట్లో తీద్దామని అనుకున్నాడు. కానీ షూట్ అయిపోయిన తర్వాత గ్రాఫిక్స్ వర్క్ చూస్తే చండాలంగా ఉండడంతో మళ్లీ దాన్ని రీ షూట్ చేసి దాదాపు 20 కోట్ల బడ్జెట్ పెట్టి తెరకెక్కించాడు. దాంతో ఈ సినిమా నలభై కోట్లకు పైన వసూళ్లను రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది. అందుకే ఈగ తో సినిమా చేసిన కూడా రాజమౌళి చాలా పర్ఫెక్ట్ గా చేస్తాడు అనే పేరు అయితే సంపాదించుకున్నాడు. ఇక ఒక ఈగ ని పెట్టి తీసిన సినిమాకి 40 కోట్లకు పైన వసూళ్లు రావటం అంటే మామూలు విషయం కాదు. ఇక అప్పుడున్న స్టార్ హీరోలు సైతం అప్పుడు ఇంకా 40 కోట్ల క్లబ్ లో చేరలేకపోయారు.   కానీ ఈగని తీసుకొచ్చి 40 కోట్ల క్లబ్ లో చేర్పించాడు అంటూ చాలా వార్తలు వచ్చాయి. మొత్తానికైతే ఈ సినిమాతో భారీ సక్సెస్ ను కొట్టి స్టార్ హీరో లేకపోయినా కూడా తను కంటెంట్ తో సినిమాను నడిపిస్తాను అంటూ ప్రూవ్ చేసిన ఒకే ఒక్క దర్శకుడు రాజమౌళి అనే చెప్పాలి. ఇక మొత్తానికైతే రాజమౌళి తన స్టాండెడ్ ఏంటో మరొకసారి ప్రతి ఒక్కరికి చూపించాడు... ఇక ఇప్పుడు మహేష్ బాబు తో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో తనని తాను మరొకసారి పెద్ద దర్శకుడి గా ప్రపంచానికి పరిచయం చేసుకోవాలని చూస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: