నాచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆఖరుగా ఈ నటుడు హాయ్ నాన్న అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... శౌర్యవ్ అనే కొత్త దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడప విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది.

ఇకపోతే నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.  డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డి వి వి ధానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇది ఎలా ఉంటే ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే నాని మరో ఇద్దరు క్రేజీ డైరెక్టర్ లతో సినిమాలను సెట్ చేసుకున్నాడు. అసలు విషయం లోకి వెళితే ... నాని ఇప్పటికే సుజిత్ దర్శకత్వంలో డి వి వి ధానయ్య బ్యానర్ లో ఓ సినిమాకి కూడా కమిట్ అయినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఇందుకు సంబంధించిన స్టోరీ కూడా ఆల్మోస్ట్ లాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దర్శకుడితో పాటు బలగం మూవీ తో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వేణు.తో కూడా నానిమూవీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వేణు కూడా నాని కి ఒక కథను వినిపించగా ... అది సూపర్ గా నచ్చడంతో నాని ఈ దర్శకుడితో కూడా పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: