మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్‌. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.భారీ బడ్జెట్ తో దిల్ రాజు, జీస్టూడియోస్ వారు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు . పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథ అందించడం విశేషం. కియారా అద్వానీ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతోంది. అలాగే శ్రీకాంత్, సునీల్ కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. ఎస్.జె.సూర్య మూవీలో పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడంట. శంకర్ ఓ వైపు కమల్ హాసన్ ఇండియన్ 2 చేస్తూ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ కూడా చేస్తూ వస్తున్నాడు. అందుకే ఈ సినిమా షూటింగ్ బాగా ఆలస్యం అవుతోంది. అవుట్ ఫుట్ విషయంలో ఖర్చు ఎక్కువ అయిన శంకర్ ఎక్కడా రాజీపడడు అనే టాక్ ఉంది. అందుకే నిదానంగా జాగ్రత్తగా తీస్తున్నాడు. ఇక ఫ్యాన్స్ కోసం అన్బరివ్ ఫైట్ మాస్టర్స్ తో హై ఆక్టెన్ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేశాడు శంకర్. ఈ యాక్షన్ రామ్ చరణ్ అభిమానులకి నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తుందట.


శంకర్ సూపర్ హిట్ మూవీ ఒకే ఒక్కడు లాగా గేమ్ చేంజర్ ఉంటుందంట. ఈ మూవీలో రామ్ చరణ్ తండ్రి, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. తండ్రి పాత్ర వింటేజ్ స్టైల్ లో రాజకీయ నాయకుడిగా ఉండబోతోందట.కొడుకు పాత్ర అయితే ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించబోతోంది. ఈ రెండు పాత్రలు డిఫరెంట్ టైం లైన్ లో ఉంటాయని సమాచారం. రాజకీయాల చుట్టూ ఈ సినిమా కథాంశం తిరుగుతుందంట. అందుకే ఒకే ఒక్కడు లాగా గేమ్ చేంజర్ ఉంటుందనే ప్రచారం నడుస్తోంది.ఇక రామ్ చరణ్ ఇప్పటికే నాయక్ సినిమాలో డ్యూయల్ రోల్ చేశాడు. మరల ఇన్నేళ్ల తర్వాత గేమ్ చేంజర్ సినిమాలో రెండు భిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు.ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి పాన్ ఇండియా లెవల్ లో వస్తోన్న మూవీ ఇదే కావడంతో ఈ మూవీపై క్రేజ్ కూడా విపరీతంగా ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనేది క్లారిటీ లేదు. మే ఆఖరుకి మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వొచ్చనే సమాచారం వినిపిస్తోంది.ఆ తరువాత రిలీజ్ పై స్పష్టత ఇస్తారేమో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: