2014 లో మిస్ ఫ్రెష్ ఫేస్ లో రన్నరప్ గా నిలిచింది ఆషికా రంగనాథ్. 2016 లో కన్నడ ఇండస్ట్రీలోకి 'క్రేజీ బాయ్' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. శివరాజ్ కుమార్ హీరోగా నటించిన 'మాస్ లీడర్' మూవీలో నటించింది.కన్నడ నాట సెన్సేషన్ హీరో దివంగత పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన 'జేమ్స్ ' మూవీలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడ నాట పలు సినిమాల్లో నటించింది. సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.. లక్ కలిసి వస్తే తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకుంటారు.
కళ్యాన్ రామ్ హీరోగా నటించిన 'అమిగోస్' మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో కళ్యాన్ రామ్ మూడు విభిన్న పాత్రల్లో నటించారు. ప్రేక్షకులకు సరికొత్త కాన్సెప్ట్ తో కొత్తదనం అందించేందుకు ప్రయత్నించారు. కాకపోతే ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా ఈ అమ్మడికి తెలుగు లో ఛాన్సులు వస్తూనే ఉన్నాయి.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా అక్కినేని నాగార్జున నటించిన 'నా సామిరంగ' మూవీలో తన అందం, అభినయంతో ప్రేక్షకులు బాగా దగ్గరయ్యింది. నా సామిరకంగ మంచి సక్సెస్ సాధించి భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో ఆషికా రంగనాథ్ కి వరుస ఆఫర్లు వస్తున్నాయి.కన్నడ నాట మంచి సక్సెస్ అందుకున్న ఆషికా రంగనాథ్ తర్వాత ఇతర భాషా చిత్రాలపై పెద్దగా ఫోకస్ చేయలేదు. కాకపోతే 2022 లో మొదటిసారిగా అథర్వ హీరోగా నటించిన 'పట్టాతు అరసన్' మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.కన్నడ చిత్ర పరిశ్రమతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పెద్దగా పక్క భాషలపై ఫోకస్ పెట్టలేదు. 2022లో తొలిసారి అథర్వ హీరోగా నటించిన 'పట్టాతు అరసన్' సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది.
ఆషికా రంగనాథ్ సినిమాల్లో ఎంత సంప్రదాయంగా కనిపిస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. వెండితెరపై తన వయ్యారాలతో ఇరగదీసిని ఈ అమ్మడు ఇప్పుడు జిమ్ లో కూడా అలాగే రెచ్చిపోయింది. తన శరీరాన్ని ఎలా పడితే అలా వంచేస్తూ ఔరా అనిపించింది.ఆషికా.. జిమ్ లో మొత్తం రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తుంది.. వివిధ రకాల వ్యాయామాలు చేస్తూ తెగ కష్టపడిపోతుంది. చాలా మంది హీరోయిన్లు నాజూగ్గా కనిపించడానికి జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఆషికా రంగనాథ్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ ఈ వీడియో చూసి ఆషిక అందాలపై తెగ కామెంట్స్ చేస్తున్నారు.ఆషికా రంగనాథ్ అదృష్టం బాగానే కలిసి వచ్చిందంటున్నారు. రెండు సినిమాలతోనే ప్రేక్షకుల మనసు దోచిన ఈ అమ్మడు ఇప్పుడు ఏకంగా మోగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర'లో ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. ఈ విషయం అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: