దిగ్గజ నటి, జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన 'భామాకలాపం 2' ఇప్పుడు ఆహాలో ప్రసారం అవుతోంది. ఈ చిత్రంలో సీరత్ కపూర్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషించారు.మీడియా, పబ్లిక్‌కి వేసిన ప్రీమియర్లకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.ప్రియమణి నటనకు ప్రత్యేక విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి రివ్యూలు కూడా వచ్చాయి. మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ రెండో పార్ట్ మీద భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పుడు భామా కలాపం 2 ప్రపంచవ్యాప్తంగా ఆదరణను దక్కించుకుంటోంది. ఈ డైనమిక్ సీక్వెల్ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంటోంది.
భామా కలాపం 2 ఎక్కువగా ఫ్యామిలీ ఆడియెన్స్, మరీ ముఖ్యంగా గృహిణులు ఎక్కువగా వీక్షిస్తున్నారు. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఫేవరెట్‌గా మారింది. ఆహాలో "భామాకలాపం 2" రికార్డులను బద్దలు కొట్టేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను సొంతం చేసుకుంది. 5 రోజుల్లోనే 10 లక్షల మంది వీక్షించారు. ఇక మున్ముందు కూడా భామా కలాపం హాట్ ఫేవరేట్‌గా మారి టాప్‌లో ట్రెండ్ కానుంది.
'భామాకలాపం 2'కి వచ్చిన స్పందన, ప్రేక్షకుల ప్రేమను చూసిన తర్వాత.. భామాకలాపం 3 త్వరలో రాబోతోందని మేకర్స్ ప్రకటించారు. భామాకలాపం తదుపరి భాగం కోసం ప్రేక్షకులు ఇప్పటికే ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. దార్శనికుడైన దర్శకుడు అభిమన్యు తడిమేటి క్రైమ్, కామెడీ ఇలా అన్నింటినీ కలిపి తీయడంతో అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది.ఈ చిత్రంలో ప్రియమణి అద్భుతంగా నటించారు. "భామాకలాపం 2"లో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమెతో పాటు శరణ్య ప్రదీప్ కామెడీ.. సినిమా మరింత ఎంటర్టైనింగ్‌గా మారింది. 'భామాకలాపం 2'లో రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ ఇతరులు కూడా కీలక పాత్రల్లో నటించారు. డ్రీమ్ ఫార్మర్స్, ఆహా స్టూడియోస్‌తో కలిసి బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: