రాజ రాజ చోర ఫేమ్ సునైన హీరోయిన్‌గా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ రెజీనా థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.గురువారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా నేరుగా ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు.గత ఏడాది జూన్ 23న రెజీనా తమిళ వెర్షన్ థియేటర్లలో విడుదలైంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి థియేటర్లలో రెజీనా సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. తెలుగు ప్రమోషన్స్ భారీ స్థాయిలో నిర్వహించారు. జూన్ 23న పలు తెలుగు సినిమాలు రిలీజ్ కావడంతో రెజీనాకు అనుకున్న స్థాయిలో స్క్రీన్స్ దొరకలేదు. దాంతో తెలుగు రిలీజ్ డేట్‌ వాయిదాపడింది. తమిళంలో సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత తెలుగులో రెజీనాను రిలీజ్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎవరు ముందుకు రాలేదు. దాంతో రెజీనా తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలో రిలీజైంది. తమిళ వెర్షన్ థియేటర్లలో రిలీజైన ఎనిమిది నెలల తర్వాత తెలుగు వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు వచ్చి

రెజీనా మూవీకి మలయాళ ఫిల్మ్ మేకర్‌ డొమిన్ డిసిల్వా దర్శకత్వం వహించాడు. రివేంజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన రెజీనా మూవీలో అనంత్ నాగ్ కీలక పాత్ర పోషించాడు. ఇందులో కంప్లీట్‌గా యాక్షన్ ఓరియెంటెడ్ రోల్‌లో సునైన నటించింది. గత సినిమాల్లో సాఫ్ట్ రోల్స్ చేసిన సునైన ఇందులో ఛాలెంజింగ్ క్యారెక్టర్‌లో కనిపించింది. తన భర్త మరణంపై ఓ యువతి ఎలా ప్రతీకారం తీర్చుకున్నదనే పాయింట్‌తో దర్శకుడు రొమిన్ డిసిల్వా రెజీనా మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాలో సునైన నటనకు ప్రశంసలు దక్కాయి. కానీ కథలోని మలుపులు ఈజీగా గెస్ చేసేలా ఉండటం, కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. రెజీనా తమిళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.హీరోయిన్‌గా సునైన కెరీర్ తెలుగు సినిమాతోనే మొదలైంది. కుమార్ వర్సెస్ కుమారీ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 10 క్లాస్ మూవీ హీరోయిన్‌గా సునైనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీలో మిక్కీ జే మేయర్ పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత టాలీవుడ్‌కు 15 ఏళ్ల పాటు గ్యాప్ తీసుకున్న సునైన శ్రీవిష్ణు రాజరాజచోర మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో శ్రీవిష్ణు భార్యగా, ఓ చిన్నారికి తల్లిగా రియలిస్టిక్‌గా యాక్టింగ్‌తో మెప్పించింది. కమర్షియల్ సక్సెస్‌గా రాజరాజచోర నిలిచింది. తమిళంలో విజయ్‌, ధనుష్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది సునైన. తేరి, ఎనై నోకి పాయుమ్‌ తోట, వానమ్‌, లాఠీ సినిమాలు కోలీవుడ్‌లో ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
తెలుగులో శ్రీకాంత్ లీడ్‌రోల్‌లో నటించిన చందరంగం వెబ్‌సిరీస్‌లో సునైన ఇంపార్టెంట్ రోల్‌లో మెరిసింది. అలాగే నాని ప్రొడ్యూస్ చేసిన మీట్ క్యూట్‌లో సునైన నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: