తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా కెరియర్ ను కొనసాగిస్తున్న ప్రభాస్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ ప్రస్తుతం తమ తమ సినిమా పనులతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం వీరు ఏ సినిమాలలో నటిస్తున్నారు ..? ఆ మూవీలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్నటువంటి "కల్కి 2898 ఏడి" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అమితా బచ్చన్ , దిశా పటానిమూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. కమల్ హాసన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రామోజీ ఫిలిం సిటీ లో ప్రభాస్ మరియు కొంత మంది ఇతరులపై ఈ సినిమా షూటింగ్ ను చిత్రీకరిస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చెంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రామోజీ ఫిలిం సిటీ లో రామ్ చరణ్ మరియు కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ మూవీ లో విలన్ ఫాహధ్ ఫజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను ఈ చిత్ర బృందం చిత్రీకరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: