హీరోయిన్లు స్క్రీన్ మీద అందంగా కనిపించాలంటే మేకప్ వేసుకోవాల్సిందే. ఇక దాంతో పాటు ఫాలోయింగ్ సంపాదించాలంటే అందాలు చూపించాల్సిందే. ఇంత చేసిన పాపులారిటీ వస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. కానీ సాయి పల్లవి మాత్రం హీరోయిన్లందరికీ భిన్నం. ఎక్స్ పోజింగ్ చేయకుండా నాచురల్ గా ఉంటూనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. మంచి పాత్రలు ఎంచుకుంటూ తనకిచ్చిన పాత్రకు ప్రాణం పోస్తుంది ఈ బ్యూటీ. అవసరం లేకుండా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో దర్శనమిచ్చే ఈ రోజుల్లో హీరోయిన్ సాయి పల్లవి మాత్రం

 ఎక్స్ పోజింగ్ కి అవకాశమే లేదని చెబుతుంది. ఇకపోతే మెగా పిన్స్ వరుణ్ తేజ్   ‘ఆపరేషన్ వాలెంటైన్స్’  చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారత వైమానిక దళం నేపథ్యంలో... ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన ఆపరేషన్ ఆధారంగా రూపుదిద్దుకుందీ చిత్రం.  ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో వరుణ్ తేజ్ ఫుల్ బిజీగా ఉన్నారు. పలు ఇంటర్వ్యూలో ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలో సాయిపల్లవి తో మరోసారి చేయబోయే సినిమాపై మాట్లాడారు.  లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి - వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ‘ఫిదా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 

తొలిచిత్రంతోనే సాయిపల్లవి ఇక్కడ హిట్ అందుకుంది. ఫిదా తరువాత ఇప్పటి వరకూ ఆ కాంబోలో మరో సినిమా రాలేదు. ఈ విషయంపై వరుణ్‌ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. మళ్లీ తాము కలిసి నటించకపోవడానికి గల కారణాన్ని తెలిపారు. ''మా కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందించేందుకు సన్నాహాలు జరిగాయి. ఆ మేరకు ఇద్దరం కథ విన్నాం. కానీ, ఈసారి చేస్తే 'ఫిదా'ను మించి ఉండాలని, లేదంటే చేయకూడదని నిర్ణయించుకున్నాం. అందుకే మళ్లీ కలిసి నటించలేకపోయాం'' అని వివరించారు. ఫిదా' సినిమాలో కలిసి నటించి హిట్‌ జోడీగా నిలిచారు హీరో వరుణ్‌ తేజ్‌ , హీరోయిన్‌ సాయి పల్లవి . అందులో ఎన్‌ఆర్‌ఐగా వరుణ్‌, తెలంగాణ అమ్మాయిగా పల్లవి విశేషంగా ఆకట్టుకున్నారు. దీంతో, వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం వస్తే బాగుండని చాలామంది అభిమానులు భావించారు. కానీ, ఇప్పటి వరకూ ఆ కాంబోలో మరో సినిమా రాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: