రకుల్‌ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ వివాహం ఈ నెల 21వ తేదీన గోవా లోని ఐటీసీ గ్రాండ్‌ రిసార్ట్‌లో ఘనంగా జరిగింది. పంజాబీ ఆనంద్‌ కరాజ్‌, సింధీ సంప్రదాయాల ప్రకారం ఈ జంట పెళ్లి జరిగింది. ఈ వేడుకలో చాలామంది బాలీవుడ్ సెలెబ్రెటలు సందడి చేశారు వారిలో అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ శిల్పాశెట్టి, ఆయుష్మాన్‌ ఖురానా, అర్జున్‌ కపూర్‌, వరుణ్ ధావన్‌తో పాటు పలువురు స్టార్స్ ఉన్నారు.

ఆదివారం రోజు రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్ స్టా స్టోరీస్ లో అయోధ్య రామ మందిరం నుంచి ప్రసాదం వచ్చిందని పోస్ట్ పెట్టింది. అందుకు సంబంధించిన ఫోటో కూడా షేర్ చేస్తూ.." మా పెళ్లి తర్వాత అయోధ్య నుంచి ప్రసాదం రావడం ఆశీర్వాదంగా భావిస్తున్న నిజంగా మా జీవిత ప్రయాణంలో ఇదొక దివ్యమైన ప్రారంభం" అంటూ రాసుకొచ్చింది. రకుల్‌ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ హనీమూన్ కు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన 'బడే మియా చోటే మియా' సినిమా రిలీజ్ అనంతరం ఈ జంట హనీమూన్ కు వెళ్ళనున్నారట. కాగా 'బడే మియా చోటే మియా' ఈ ఏడాది ఈద్ కానుకగా  థియేటర్స్ లో సందడి చేయనుంది. అంటే రకుల్, జాకీ ఈద్ తర్వాతే హనీమూన్ ట్రిప్ కి వెళ్తారని తాజా సమాచారం.

ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం హిందీలో 'మేరీ పత్నీ కా' రీమేక్‌లో నటిస్తోంది. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అటు సౌత్ లో తమిళంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న 'ఇండియన్‌ 2' సినిమాలో ఫీమేల్‌ లీడ్ రోల్ ప్లే చేసింది. సమ్మర్ కానుకగా మే లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా తెలుగులో ఈ ముద్దుగుమ్మ చివరగా వైష్ణవ్ తేజ్ సరసన 'కొండ పొలం' సినిమాలో నటించింది. క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: