ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారం గా టాలీవుడ్ కాంట్రవర్సియల్  డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలి టికల్ డ్రామా సినిమాలు 'వ్యూహం', 'శపథం'.చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ రెండు చిత్రాలు.. ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వివాదాలు వల్ల పోస్టుపోన్ అవుతూ వచ్చింది. 'వ్యూహం' గత ఏడాది డిసెంబర్‌లో, 'శపథం' ఈ ఇయర్ ఫిబ్రవరిలో విడుదల కావాల్సి ఉంది.అయితే ఈ సినిమా లో చంద్రబాబు నాయుడు ప్రతి ష్ఠని దెబ్బతీసేలా సన్నివేశా లను రూపొందించారని.. నారా లోకేశ్సినిమా రిలీజ్ ని అడ్డుకుంటూ కోర్టులో పిటిషన్ వెయ్యడంతో రిలీజ్ వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఎలాగైనా రిలీజ్ చేయాలని పట్టుబట్టిన ఆర్జీవీ.. కోర్టులో పోరాడి రిలీజ్ కి అన్ని అడ్డంకులు తొలిగించుకొని సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధ మయ్యారు.కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే 'వ్యూహం'ని ఫిబ్రవరి 23న, 'శపథం'ని మార్చి 1న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ మళ్ళీ పది రోజుల తరువాత ఆ రిలీజ్స్ ని వాయిదా వేస్తున్నట్లు ప్రక చారు. వ్యూహం సినిమాని మార్చి 1కి, శపథం మూవీ ని మార్చి 8కి తీసుకు వస్తామంటూ కొత్త రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మరోసారి డేట్ ని మారుస్తూ ఆర్జీవీ అనౌన్స్ చేశారు.మార్చి 1న విడుదల కావాల్సిన వ్యూహం సినిమా ని ఒకరోజు ఆలస్యంగా మార్చి 2న తీసుకు వస్తున్నట్లు.. ఆర్జీవీ స్వయం గా ప్రక టించారు. వ్యూహం సెన్సార్ స ర్టిఫికెట్ పోస్టు చేస్తూ.. పట్టు వదలని విక్రమార్కుడని అంటూ రాసుకొచ్చారు. కాగా ఈ చిత్రాన్ని U/A సర్టిఫికెట్ ని ఇచ్చారు. మొత్తం 2 గంటల 1 నిమిషం 37 సెకన్ల నిడివితో ఈ చితం ఆడియన్స్ ముందుకు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: