టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ ‘కార్తికేయ 2' సినిమాతో మొదటి సారి పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. ఈ సినిమాతో నిఖిల్ రేంజ్ మారిపోయింది.దేశవ్యాప్తంగా తనకు మంచి గుర్తింపు వచ్చింది.అయితే ఆ ఇమేజ్ ను దృష్టి లో పెట్టుకుని నిఖిల్ తన కొత్త సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.నిఖిల్ నటిస్తున్న్న లేటెస్ట్ మూవీ 'స్వయంభు'..పీరియాడిక్ యాక్షన్ డ్రామగా ఈ మూవీ తెరకెక్కుతుంది.ఈ మూవీ లో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా క్యూట్ హీరోయిన్ నభా నటేష్ మరో హీరోయిన్ గా నటిస్తున్నట్లుగా కొన్ని రోజుల క్రితం వార్తలు వినిపించాయి.. ఇప్పుడు ఆ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.'స్వయంభు'మూవీలో నభా నటేష్  హీరోయిన్ గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. మూవీలో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. 

పోస్టర్ లో ముక్కు పుడక, చెవి దిద్దులు, పాపిడి బిళ్ల పెట్టుకున్న నభా పీరియాడిక్ లుక్ వైరల్ అవుతుంది. యువ రాణిగా నభా లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న నభా నటేష్ కొంత విరామం తర్వాత ఈ సినిమా తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘స్వయంభు’ మూవీ నిఖిల్ కెరీర్ లో 20వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు.. 'ఠాగూర్' మధు సమర్పణ లో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్ మరియు శ్రీకర్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా లో నిఖిల్ ఓ పవర్ ఫుల్ వారియర్ గా కనిపించునున్నారు. ఇప్పటికే రిలీజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పై అంచనాలు పెంచేసింది.. ఈ చిత్రానికి సలార్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. నిఖిల్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో ‘స్వయంభు’మూవీ తెరకెక్కుతోందీ.

మరింత సమాచారం తెలుసుకోండి: