టాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీలలో సూపర్ క్రేజ్ కలిగిన బ్యూటీలు అయినటువంటి తమన్నా , రాశి కన్నా ప్రస్తుతం "అరుణ్మనై 4" అనే తమిళ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు తమిళ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్ లో భాగంగా వచ్చిన 3 మూవీ లు వచ్చాయి. అవి కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి. ఈ సిరీస్ లోని మూవీ లు తెలుగు లో వేరు వేరు పేర్లతో విడుదల అయ్యాయి. 

ఇది ఇలా ఉంటే "అరుణ్మనై 4" సినిమా కూడా తెలుగు లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు లో "బాక్" అనే పేరుతో విడుదల కానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని కూడా ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాలోని తమన్నా , రాశి ఖన్నా క్యారెక్టర్ పోస్టర్ లను కూడా విడుదల చేశారు. ఈ మూవీ లో తమన్నా ... శివాని పాత్రలో కనిపించనుండగా రాశి కన్నా ... మాయ పాత్రలో కనిపించబోతుంది.  ఇకపోతే రాశి కన్నా ఇప్పటికే "అరుణ్మనై 3" లో హీరోయిన్ గా నటించింది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం వరకు ఏప్రిల్ 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ మూవీ ని ఏప్రిల్ 26 వ తేదీన విడుదల చేయడం లేదు అని కొత్త విడుదల తేదీని ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ ని మే 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. కోవై సరళ , యోగి బాబు , వెన్నెల కిషోర్ , శ్రీనివాస రెడ్డి , సునీల్ , కెఎస్ రవికుమార్ , తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హిప్హాప్ తమిజా సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: