తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్…ఈయన చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడంతో మొదటి అడుగులోనే ఆయన సక్సెస్ అయ్యాడు.ఇక రెండో సినిమాగా దర్శక ధీరుడు అయిన రాజమౌళి డైరెక్షన్ లో మగధీర అనే సినిమా చేసి ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేశాడు.ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ తన ఎంటైర్ కెరియర్ లో ఒక సినిమాని 100 సార్లు చూశాడట. ఇంతకీ అది ఏ సినిమా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఖుషి ‘… ఇక ఈ సినిమాను చరణ్ ఇప్పటివరకు ఒక 100 సార్లు చూశారని ఆయన ఫ్రెండ్స్ చెబుతూ అంటారు. ఆ సినిమా అంటే ఆయనకు విపరీతమైన ఇష్టమట. ఇక ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ, సాంగ్స్ కానీ, సినిమా స్టోరీ కానీ చాలా ఫ్రెష్ గా ఉంటుందంటూ రామ్ చరణ్ ఒకానొక సందర్భంలో తెలియజేశాడు.

నిజానికి చిరంజీవి సినిమాల్లో చాలా సినిమాలను ఆయన చాలాసార్లు చూసినప్పటికీ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాని ఇప్పటికి వంద సార్లు చూడడం అనేది నిజంగా గ్రేట్ విషయం అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉండే ఒక టైప్ ఆఫ్ స్టోరీ గాని, ఆయన మేనరిజమ్స్ కానీ రామ్ చరణ్ కి అమితమైన ఇష్టమట. అందువల్లే ఆయన సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉండేవారట. ఇక ఇప్పుడు కూడా రామ్ చరణ్ నటిస్తున్నప్పుడు కొన్ని యాంగిల్స్ లో మనకు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది.ఎందుకంటే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చూస్తూ పెరిగాడు కాబట్టి కొన్ని షాట్స్ లో పవన్ కళ్యాణ్ ఎలాగైతే నటిస్తాడో చరణ్ యాక్టింగ్ కూడా అలాగే అనిపిస్తుంది… ఇకపోతే రామ్ చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాను తొందర్లోనే రిలీజ్ చేసి అభిమానుల్లో ఒక నూతన ఉత్సాహన్ని నింపాలని రామ్ చరణ్ భావిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: