టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకొని నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. 

ఈయన కేవలం సినిమాల్లో హీరో గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా తాను హీరోగా రూపొందిన పలకనామా దాస్ , దాస్ కా దమ్కి అనే రెండు మూవీ లకు దర్శకత్వం వహించి ఈ రెండు మూవీ లతో కూడా మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకొని దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇలా ఇప్పటికే తెలుగు లో నటుడి గా , దర్శకుడు గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ కి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తూ ఉండగా ... సితార ఎంటర్టైన్మెంట్ సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన విడుదల తేదీలను అనేక సార్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ చాలా సార్లు ఇప్పటికే పోస్ట్ పోన్ కూడా అయ్యింది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ని మే 17 వ తేదీన విడుదల చేయనున్నారు అని అఫీషియల్ గా మేకర్స్ ప్రకటించారు. కానీ మళ్ళీ ఈ మూవీ ని పోస్ట్ పోన్ చేశారు. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను మే 17 వ తేదీన కాకుండా మే 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs