టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ ఇండియా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమైంది.అయితే గత ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉంటూ మయోసైటిస్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే ఈ అమ్మడికి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా సరే నెటింట ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక నాగచైతన్యతో డివోర్స్ తర్వాత ఆమె పర్సనల్, అలాగే రిలేషన్ షిప్ స్టేటస్ లపై తరచూ ఏవో వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా తనతో పని చేసే టీం మేట్స్ తో సమంతకు ఎఫైర్ ఉందంటూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.
కొన్నేళ్లుగా సమంతతో మంచి పరిచయం ఏర్పరచుకున్న తన స్టైలిష్ ప్రీతం జకాల్కర్‌కు సమంతతో ఎఫైర్‌ వార్తలు గతంలో వైరల్ అయ్యాయి. అయితే మంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందంటూ వస్తున్న వార్తలకు తగ్గట్టుగానే వారు ప్రవర్తించే తీరు కూడా ఉంది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ ఎఫైర్‌లపై వస్తున్న వార్తలకు చెక్కపడింది. కాగా లేటెస్ట్‌గా సమంత పోస్టుతో మళ్ళీ ఆ వార్తలకు తెరలిపినటైంది. ఇంతకీ సమంత చేసిన పోస్ట్ ఏంటి.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. తాజాగా ప్రీతం జుక్కల్కర్ పుట్టిన రోజు జరగడంతో అతనికి సమంతా విషెస్ తెలియజేస్తూ.. ఐ లవ్ యు అంటూ పోస్ట్ ను షేర్ చేసింది.
సమంత ఈ పోస్టులో హ్యాపీ బర్త్డే బేబీ బాయ్.. నీతో పాటు నువ్వు ఉన్న ప్రపంచమంతా కూడా అద్భుతంగా ఉంటుంది. గాడ్ బ్లెస్స్ యు , ఐ లవ్ యు అంటూ రాసుకొచ్చింది. అయితే విషెస్ చెప్పడం వరకు బాగానే ఉన్నా ఐ లవ్ యు చెప్పడం ఏంటి అంటూ సమంత ఏంటి టీం ఫైర్ అవుతున్నారు. దీనిపై ఆమె ఫ్యాన్స్ స్పందిస్తూ ఇష్టం ఉన్నవారికి ఎవరికైనా ఐ లవ్ యూ అని చెప్పవచ్చని.. అది కేవలం ప్రేమికులు మాత్రమే చెప్పుకునే పదం కాదు అంటూ.. ఆమెకు సపోర్ట్ గా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం సమంత చేసిన పోస్ట్ తెగ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: