టాలీవుడ్ ఇండస్ట్రీలో అందాల రాక్షసిగా పేరు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి మన అందరికీ సుపరిచితమే. లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత వెబ్ సిరీస్ లలో నటిస్తూ సినిమాలలో నటించేందుకు ప్రయత్నిస్తుంది.టాలీవుడ్‌నే శాసిస్తున్న ఫ్యామిలీలో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ బ్యూటీ స్టేటల్ మరింత పెరిగిపోయిందని చెప్తుంటారు.కాగా ఇటీవల ఈ అమ్మడు చేసిన పనితో మెగా ఫ్యామిలీ విమర్శలు ఎదుర్కొంటున్నది. చివరికి చిరంజీవి సతీమణి సురేఖ కూడా సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. చిరంజీవి అభిమానులైతే మెగా ఫ్యామిలీ పరువు మొత్తం తీసేసిందిగా అంటూ తిట్టిపోస్తున్నారు. ఇంతకీ ఆమె చేసిన పనేంటో అనుకుంటున్నారా?చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల ఇటీవల కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోడలు ఉపాసన తో కలిసి అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టారు.మెగా కోడలు ఉపాసన అత్తమ్మాస్ కిచెన్ ప్రొడక్ట్స్ ను ఎంతగా ప్రమోట్ చేస్తున్నారో చెప్పనక్కరలేదు. సురేఖ ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేసే సమయంలో ఫన్నీ వీడియోస్ తో వాటిని ప్రమోట్ చేస్తుంటుంది ఉపాసన. ఈ అత్తమ్మాస్ కిచెన్ కి మంచి ఆదరణ లభిస్తుంది.

అయితే తాజాగా లావణ్య త్రిపాఠి చేసిన పనికి అత్తమ్మాస్ కిచెన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు నెటిజన్లు ఈ ప్రొడక్ట్స్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల అత్తమ్మాస్ కిచెన్ అఫీషియల్ పేజీలో లావణ్య త్రిపాఠి, ఆమె అత్త పద్మజ కలిసి ఆవకాయ తయారు చేస్తున్న ఫోటో షేర్ చేశారు. ఇందులో వాళ్ళు చేతులకు గ్లౌజులు, తలకు క్యాప్స్ ధరించలేదు. దాంతో ఫొటోలపై కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.అత్తమ్మాస్ కిచెన్ ప్రొడక్ట్స్ విషయంలో సరైన నాణ్యత, విలువలు పాటించడం లేదు. ఆవకాయ కలిపే సమయంలో చేతులకు గ్లౌజ్ పెట్టుకోలేదు. జుట్టు కూడా లూజ్ గా వదిలేశారు. అందులో హెయిర్ పడితే పరిస్థితి ఏంటి? అత్తమ్మాస్ కిచెన్ తమ ప్రొడక్ట్స్ విషయంలో అసలు హైజీన్ పాటిస్తుందా లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి చాలా అంది నెటిజన్స్ మద్దతుగా రిప్లై ఇచ్చారు. దీంతో అత్తమ్మస్ కిచెన్ టీం స్పందించారు.ఇది పర్సనల్ ప్యాక్… లావణ్య, పద్మ గారు తమ కోసం చేస్తున్న ఆవకాయ్ ఇది. కాబట్టి వారు సాధారణంగా చేశారు. నిజానికి కష్టమర్స్ కోసం చేసేటప్పుడు మేము చాలా హైజీన్ పాటిస్తాము. ఈ విషయంలో మీకు ఎలాంటి సందేహాలు వద్దు. ప్రొడక్ట్స్ తయారు చేసేటప్పుడు అన్ని ప్రమాణాలు పాటిస్తామని టీం వెల్లడించారు. అత్తమ్మాస్ కిచెన్ కి హెల్ప్ చేద్దామని లావణ్య చేసిన ప్రయత్నం దెబ్బకొట్టింది. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్ కంటిన్యూ చేస్తుంది.ప్రజెంట్ ఈ ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: