ఇక ఇప్పటికే నార్త్‌లో 'హౌస్ ఫుల్4' లో నటించిన రానా.. ఇప్పుడు అక్కడ మరో మూవీపై సైన్ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో హీరోయిన్గా కృతి కర్బంద పేరు వినిపిస్తుంది. ఇంకా టైటిల్ అనౌన్స్మెంట్ ఇవ్వని ఈ మూవీ షూటింగ్ కూడా ఇప్పటికే స్టార్ట్ చేసినట్లు అక్కడ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా రాలేదు. కాగా.. ఈ అక్టోబర్‌లో 'వేట్టయాన్'తో మొదలయ్యే రానా ప్యాన్ ఇండియా జర్నీ.. ఏ రేంజ్లో సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సి ఉంది.మరోవైపు షాహిద్ కపూర్ నటించే ఛత్రపతి శివాజీ మహరాజ్ మూవీలో ఔరంగజేబ్‌గా మిస్టర్ దగ్గుబాటి నటిస్తున్నట్టు వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ అక్టోబర్‌లో వేట్టయాన్‌తో మొదలయ్యే రానా ప్యాన్ ఇండియా జర్నీ మరో రేంజ్లో స్పీడందుకోబోతోందన్నమాట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి