తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదరహితుడు, అజాతశత్రువుగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్. స్నేహానికి ప్రాణమిస్తూ, మిత్రుల కోసం నిలబడుతూ ఆయన అందరి చేత
డార్లింగ్ అనిపించుకున్నారు.
బాహుబలి సిరీస్‌తో పాన్
ఇండియా స్టార్ కావడమే గాక.. దేశంలోనే నెంబర్ వన్ హీరోగా చెలామణి అవున్నారు. సినిమాకు రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్.. తన సంపాదనను కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం ఖర్చు చేస్తుంటాడు. మూడో కంటికి తెలియనివ్వకుండా ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేశాడు.తన మిత్రులు, సన్నిహితులకు బహుమతులు, స్వీట్లు పంపడం ప్రభాస్‌కు అలవాటు. అలాగే షూటింగ్ జరుగుతున్న సమయంలోనూ యూనిట్ సభ్యులందరికీ తన ఇంటి నుంచి భోజనాలు తెప్పిస్తుంటాడు ప్రభాస్. అవి మామూలుగా ఉండదు.. రకరకాల వంటకాలతో అదిరిపోతాయి. ఆ వంటకాలు తిన్నవారు వహ్ వా అనాల్సిందిలే.ప్రభాస్
సినిమా సెట్స్ లో
హీరోయిన్స్ కి, ఆర్టిస్టులకు అప్పుడప్పుడు ఇంటినుంచి పలు రకాల ఫుడ్ తెప్పించి మరీ పెడతాడని తెలిసిందే.
ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి,
ప్రభాస్ ఫుడ్ తో చేసే మర్యాద గురించి ఆర్టిస్టులు,
ప్రభాస్ తో పనిచేసేవాళ్ళు, ముఖ్యంగా
హీరోయిన్స్ గొప్పగా చెప్తారు. ఇప్పటిదాకా
ప్రభాస్ తో పని చేసిన ప్రతి
హీరోయిన్ ప్రభాస్ పెట్టిన ఫుడ్ గురించి మాట్లాడారు. తాజాగా ఆ లిస్ట్ లో మరో
హీరోయిన్ చేరింది.ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో
తమిళ భామ
మాళవిక మోహనన్
హీరోయిన్ గా నటిస్తుంది.
తాజాగా తాను నటించిన
విక్రమ్ తంగలాన్
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా
మాళవిక హైదరాబాద్ లో మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో
ప్రభాస్ రాజాసాబ్ గురించి ప్రశ్నలు ఎదురవ్వగా
ప్రభాస్ ఫుడ్ గురించి, రాజాసాబ్
సినిమా గురించి మాట్లాడింది.మాళవిక మోహనన్
ప్రభాస్ పెట్టె ఫుడ్ గురించి మాట్లాడుతూ..
హైదరాబాద్ లో బెస్ట్ ఫుడ్ నాకు
ప్రభాస్ పంపించాడు. మా అమ్మ ఫుడ్ తర్వాత నేను ఇప్పటివరకు తిన్న ఫుడ్ లో బెస్ట్ ఫుడ్
ప్రభాస్ సర్ పంపించిందే. ఆల్మోస్ట్ మా అమ్మ ఫుడ్ కి ఈక్వల్ గా ఉంటుంది. అని తెలిపింది. ఇక రాజాసాబ్
సినిమా గురించి మాట్లాడుతూ..
ప్రభాస్ సర్ సినిమాలో అలాంటి క్యారెక్టర్ రావడం నాకు చాలా గ్రేట్ అనిపించింది. ఆ క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది. మారుతీ సర్ ఫిమేల్ క్యారెక్టర్స్ బాగా రాస్తారు. మీరంతా రాజాసాబ్ చూడాలని ఎదురుచూస్తున్నాను. తంగలాన్ లోని నా పాత్రకు పూర్తి వ్యతిరేకంగా రాజాసాబ్ పాత్ర ఉంటుంది అని తెలిపింది.తన లేటెస్ట్
మూవీ కల్కి 2898 ఏడీలో హీరోయిన్‌గా నటించిన
బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణే ఓ షెడ్యూల్ నిమిత్తం
హైదరాబాద్ వచ్చారు. సెట్స్‌లో అడుగుపెట్టిన దీపికకు
ప్రభాస్ ఇంటి నుంచి ప్రత్యేకంగా విందు భోజనం వచ్చింది. ఈ ఫోటోలను
దీపిక స్వయంగా సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరారు మలయాళ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్.