సినిమాల ఫంక్షన్స్ కు సంబంధించి వేదిక పై ఉన్నప్పుడు బయట మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు చాకో వ్యవహారశైలి చాల విభిన్నంగా ఉంటుంది అన్న ప్రచారం ఉంది. దీనికి కారణం అతడికి చాల అరుదైన అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ ఉంది అన్న ప్రచారం ఉంది. ఈవిషయాన్ని చాకో కూడ స్వయంగా అంగీకరించాడు అని అంటారు.
ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తులు తరచుగా ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారని తమను చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు గుర్తించాలని కోరుకుంటారని ఇతర నటుల నుండి ప్రత్యేకంగా నిలబడటానికి ప్రయత్నిస్తారని వైద్యులు చెపుతూ ఉంటారు. అరుదైన ఈ డిజార్డర్ వల్ల విలక్షణ నటుడి మ్యారేజ్ కూడ క్యాన్సిల్ అయిందని స్వయంగా చాకో ఒక ఇంటర్వ్యూలో చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు.
ఈ సంవత్సరం జనవరిలో తనూజ అనే అమ్మాయితో షైన్ తన ఎంగేజ్మెంట్ అయిందని ప్రకటించి అందరు అతడి పెళ్ళికోశం ఎదురు చూస్తున్న సమయంలో తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని ప్రకటించి అందరికీ మరొకసారి షాక్ ఇచ్చాడు. తనూజ తో పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి గల కారణం తన అనారోగ్యం అంటూ ఓపెన్ గానే తన ఇంటర్వ్యూలో చెప్పాడు. తన అనారోగ్యానికి గల కారణం డాక్టర్స్ కూడ సరిగ్గా చెప్పలేకపోతున్నారని షైన్ చాకో బాధపడుతున్నాడు. ప్రస్తుతం సమాజంలో చాలామందికి వస్తున్న విచిత్రమైన అనారోగ్యాలకి కారణాలు తెలియని పరిస్థితులలో షైన్ కు వచ్చిన అనారోగ్యం పట్ల అతడి అభిమానులు అతడి పై సానుభూతి చూపెడుతున్నారు..