టాలీవుడ్ ఇండస్ట్రీలో అలనాటి సినిమాలు ఇప్పటికీ తెలుగు ప్రజల మనస్సులో అలా నిలిచిపోయి ఉంటాయి. అందుల దర్శకుడు వైవీఎస్ చౌదరి సినిమాల ప్రత్యేక వేరు. శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య లాంటి హిట్ సినిమాలు చేశారు. దేవదాసు, ఒక్కమగాడు, రేయ్, నిప్పు సినిమాలు చేసి సెన్సేషనల్ డైరెక్టర్ అనిపించుకున్నారు. ఆయన ఖాతాలో సూపర్ హిట్లు ఉన్నాయి. అలాగే ఫ్లాప్లు ఉన్నాయి. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా రీఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పారు. దర్శకుడిగా కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నట్లు ప్రెస్ మీట్ పెట్టిమరీ ప్రకటించారు. 

నందమూరి తారకరామారావుకు వీరాభిమాని అయిన వైవీఎస్ చౌదరి.. తాజాగా ఆయన మనవడు, నందమూరి జానకీ రామ్ తనయుడు అయిన తారకరామారావును హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ మూవీకి వైవీఎస్ భార్యనే నిర్మాత కావడం విశేషం. ఈ మూవీ గురించి ఇప్పటికీ ఎటువంటి అప్ డేట్ లేవు. స్టార్ట్ అయ్యిందో లేదో కూడా తెలియదు. అయితే ఇప్పటికే ఈ మూవీపై రెండు ప్రెస్ మీట్లను వైవీఎస్ చౌదరి పెట్టారు. ప్రెస్ మీట్లో ఆయన కాస్త చాదస్తంగా మాట్లాడ్డారనే టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో దీనిపై కామెంట్లు విపరీతంగా వినిపిస్తున్నాయి. 

మొదటి ప్రెస్ మీట్‌లో ఆయన సినిమా వివరాల గురించి చెప్పారు. అలాగే ఎన్టీఆర్ కుటుంబంపై ఆయనకున్న అభిమానాన్ని వెలిబుచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు రెండో ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అందులో కొత్త విషయాలు చెబుతారనుకుంటే అదీ జరగలేదు. పాతపాటే పాడారు. నందమూరి కుటుంబంపై ఆయనకున్న అభిమానాన్నే మళ్లీ మళ్లీ చెప్పసాగారు. కీరవాణి సంగీతం, చంద్రబోస్ పాటలు, బుర్రా సంభాషణలు..ఇలా చెప్పిందే చెప్పారు. వారిని పొగడటమే తప్పా కొత్త పాయింట్ ఏమీ చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఆయనపై నెట్టింట ట్రోల్స్ నడుస్తున్నాయి. చెప్పిందే చెప్పక పని కానియ్యి అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఈ టైంలో సినిమా తీసి మళ్లీ తనను తాను ప్రూఫ్ చేసుకోవాల్సిన అవసరం వైవీఎస్‌కు ఉంది. కానీ వాటి సంగతి మర్చిపోయి ఇలా ప్రెస్ మీట్లలో పొగడ్తలు ఏంటని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: