
ఈ పాట అన్నింటి కంటే కూడా లేటుగా యూట్యూబ్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ పాట తెలంగాణ ఫోక్ సింగర్ లక్ష్మీదాస పాడగా ఆమె వాయిస్ భలే సెట్ అయింది. ఆమె హస్కి వాయిస్ పాటకి అదనపు అందాన్ని తెప్పించింది. ఇక ఆ పాటలు అల్లు అర్జున్ - రష్మిక అయితే పోటీపడి డాన్సులు వేయడం అయితే అభిమానులను తెగ అలరించింది. ఇక అసలు విషయంలోకి వెళితే ఈ పాటకు తాజాగా ఓ జపాన్ జంట స్టెప్పులు వేయడంతో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. దాంతో అల్లు ఫాన్స్ అయితే 'పుష్ప అంటే నేషనల్ అనుకుంటున్నావా? ఇంటర్ నేషనల్' అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ పాటను ఆలపించిన లక్ష్మీదాస స్వస్థలం నిర్మల్ జిల్లా ముధోల్ మండలం గన్నోర. ఆమె యూట్యూబ్‌లో పలు ప్రైవేటు ఆల్బమ్స్‌లో పాటలు పడడంతో పాపులర్ అయ్యారు. 'ఓ బావో సైదులు.. తిన్నా తీరం పడతలే.. ఆనాడేమన్నంటిన తిరుపతి.. అందాల నా మొగుడు..' పాటలు ఆమెకు చెప్పలేనంత క్రేజ్ తీసుకొచ్చాయి. య్యూట్యూబ్‌లో మిలియన్స్ కొద్ది వ్యూస్ సాధించిపెట్టాయి. దీంతో ఆమెకు సినీ రంగంలో కూడా అవకాశాలు తెచ్చి పెట్టాయి. ఈ క్రమంలోనే పుష్ప 2 మూవీలో పీలింగ్స్ సాంగ్ పాడే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తుండగా.. సింగర్ లక్ష్మీదాస సైతం మంచి పేరు తెచ్చుకున్నారు.