కోలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో విక్రమ్ ఒకరు. విక్రమ్ కి ఎక్కువ విజయాలు లేకపోయినా కమర్షియల్ సినిమాలలో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపకుండా ఎప్పుడు వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ రావడంతో ఆయనకు అపజయాలు ఉన్నా కూడా మంచి క్రేజ్ ఉంది. విక్రమ్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా విడుదల అయ్యాయి. అందులో కొన్ని మూవీలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో ఈ నటుడికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఉంది.

విక్రమ్ ఆఖరుగా తంగాలన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీకి కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న పా రంజిత్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా భారీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమాలో విక్రమ్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇకపోతే ప్రస్తుతం విక్రమ్ "వీర ధిర శుర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ సినిమాను ఈ సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో విక్రమ్ కత్తి పట్టుకొని నిల్చొని ఉన్నాడు. ఇక ఈ మూవీ టైటిల్ , అలాగే ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన పోస్టర్ ను బట్టి చూస్తే ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అని అర్థం అవుతుంది. మరి ఈ సినిమాతో విక్రమ్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: