నటుడు మరియు నిర్మాత అయినటువంటి కళ్యాణ్ రామ్ తాజాగా అర్జున్ S/O విజయశాంతి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సాయి మంజ్రేకర్ , కళ్యాణ్ రామ్ కి జోడిగా నటించగా ... ప్రదీప్ చిలుకూరు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. అలనాటి స్టార్ నటి అయినటువంటి విజయశాంతిమూవీ లో కళ్యాణ్ రామ్ కి తల్లి పాత్రలో నటించింది. ఈ మూవీ ని రేపు అనగా ఏప్రిల్ 18 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో గతి కొన్ని రోజులుగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు.

ఇప్పటివరకు ఈ మూవీ నుండి మేకర్స్ అనేక ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ఈ మూవీ బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాలి. ఈ మూవీ ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు ఏర్పడడంతో ఈ మూవీ కి అద్భుతమైన ప్రి రిలీజ్ జరిగినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ భారీ టార్గెట్ తోనే బాక్సాఫీస్ బరిలోకి దిగబోతోంది  మరి ఈ మూవీ 24 కోట్ల కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రాబట్టి హిట్ స్టేటస్ ను అందుకోవాలి అంటే కచ్చితంగా ఈ మూవీ కి అద్భుతమైన టాక్ రావాల్సిందే అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nkr