నటి పావని రెడ్డి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె తెలుగు, తమిళంలో అనేక షోలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఓవైపు సీరియల్స్ లో చేస్తూనే మరోవైపు సినిమాలలోనూ అవకాశాలను అందుకుంది. సినిమాలలో పలు కీలక పాత్రలను నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా నటి పావని రెడ్డి రెండో వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. తమిళ బిగ్ బాస్ షోలో ఈ చిన్నది పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ షోలో పరిచయమైన కొరియోగ్రాఫర్ అమీర్ తో కలిసి పావని కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంది.


 అమీర్, పావని రెడ్డి గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అనంతరం కుటుంబ సభ్యులను ఒప్పించి ఈరోజు హిందూ సాంప్రదాయం పద్ధతిలో వివాహం చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇక పావని రెడ్డి 2017లో ప్రదీప్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ప్రదీప్ అతి తక్కువ సమయంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రదీప్ మరణ వార్త తెలుసుకున్న పావని డిప్రెషన్ లోకి వెళ్ళింది.


ఆ తర్వాత నెమ్మదిగా కోలుకొని షోలలో పార్టీసిపేట్ చేయడం ప్రారంభించింది. అనంతరం బిగ్ బాస్ షోకి సెలెక్ట్ అయి అక్కడ కొరియోగ్రాఫర్ తో ప్రేమలో పడిన ఈ చిన్నది వివాహం చేసుకుంది. పావని రెడ్డి తెలుగులో అమృతంలో చందమామ, గౌరవం, చారి 111, సేనాపతి వంటి అనేక సినిమాలలో నటించారు. ప్రస్తుతం పావని రెడ్డి పలు సినిమాలు, సీరియల్స్ లో బిజీగా గడుపుతోంది.

ప్రస్తుతం పావని రెడ్డికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. పావని రెడ్డి, అమీర్ దంపతులకు స్పెషల్ విషెస్ తెలియజేస్తున్నారు. పావని రెడ్డి, అమీర్ సంతోషంగా వారి వైవాహిక జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: