
అయితే ఈ సినిమా కి ఇంత ఖర్చు ఎందుకు అవుతుందంటే కేవలం రెమ్యూనరేషన్లే కారణమని అంటున్నారు .. దర్శకుడు , నటీనటులు , టెక్నీషియన్లు కలిపి మొత్తం 60 కోట్లు వరకు ఖర్చు అయిపోయింది .. ఇందులో హీరో ధనుష్ రెమ్యూనరేషన్ 30 కోట్లు అటు ఇటుగా ఉంటుంది .. అలాగే నాగార్జున ఈ సినిమాకు తన కెరియర్ లోనే హైయెస్ట్ పారితోషకం తీసుకున్నారు .. దాదాపు 14 కోట్లు నాగార్జున తీసుకున్నట్టు తెలిసింది .. ఇక హీరోయిన్ రష్మిక , దేవి శ్రీ ప్రసాద్ ఇవన్నీ కలిపి సినిమా ఖరచ్చు మరింత పెరిగిపోయింది ..
అయితే ఇప్పుడు శేఖర్ కమ్ములా తీసుకున్న ఈ సబ్జెక్ట్ ప్రకారం బ్యాంకాక్ , ముంబైలో అధిక భాగం షూట్ చేశారు. అలాగే ఎక్కువ రోజులు వర్క్ కూడా చేశారు .. దీని కారణంగా ఖర్చులు వడ్డీలు అన్నీ కలిపి ఈ సినిమాకు ఖర్చు 130 కోట్ల వరకు పెరిగిపోయింది .. అయితే ఇప్పుడు ఈ సినిమాకు ఓటీటీ హిందీ కలిపి 90 కోట్ల వరకు రికవరీ వచ్చేసింది .. ఎంతో కీలకమైన కోలీవుడ్ వర్షన్ ఇంకా ఉంది .. తెలుగు ధియేటర్ హక్కులు కూడా ఉన్నాయి .. అందువల్ల కుబేర మూవీ నిర్మాతలకు ప్రాఫిటబుల్ అని కూడా అంటున్నారు .. ఇక మరి కుబేర రిలీజ్ తర్వాత నాగార్జున , ధనుష్ , డైరెక్టర్ శేఖర్ కమ్ములకు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి ..