తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. అలా కెరియర్ను ముందుకు సాగిస్తున్న సమయంలోనే ఈయన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లి చూపులు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో విజయ్ దేవరకొండ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత కూడా ఈయన నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే తాజాగా తమిళ నటుడు సూర్య "రేట్రో" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని మే 1 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు భాషలో కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు తాజాగా హైదరాబాదులో ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

రెట్రో మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ... సూర్య సార్ చాలా మంచివారు. నేను హీరోగా రూపొందిన టాక్సీవాలా , గీతా గోవిందం సినిమాలు విడుదలకు ముందే లీక్ అయ్యాయి. ఆ సమయంలో సూర్య గారు నాకు అస్సలు పరిచయం లేరు. ఆయన ఆ సినిమాల విషయంలో స్పందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అని రెట్రో మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd