కె విజయ్ భాస్కర్ డైరెక్షన్లో త్రివిక్రమ్ అందించిన కథతో మన్మధుడు సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని నాగార్జున హీరో గానే కాకుండా తన సొంత బ్యానర్ లో ప్రొడ్యూస్ కూడా చేశారు. అలా నాగార్జుననే హీరోగా.. ఆయనే నిర్మాతగా 2002లో తెరకెక్కిన మన్మధుడు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో నాగార్జున సరసన అన్షు అంబానీ, సోనాలి బింద్రే లు నటించారు.. అయితే ఈ సినిమా టైటిల్ మన్మధుడు.. కానీ ఈ సినిమాలో నాగార్జునకి అమ్మాయిలు అంటే అస్సలు పడదు. అయితే ఫ్లాష్ బ్యాక్ లో నాగార్జున నిజంగానే మన్మధుడు. కానీ అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయిందని అప్పటినుండి అమ్మాయిలంటే అసహ్యంగా ఉంటారు. అయితే త్రివిక్రమ్ అందించిన కథతో విజయ్ భాస్కర్ డైరెక్షన్ వహించిన ఈ సినిమాకి మొదట వేరే హీరోని అనుకున్నారట మేకర్స్.. 

అయితే సినీ ఇండస్ట్రీలో ఒకరి కోసం అనుకున్న కథను మరొకరు చేసిన సందర్భాలు, సినిమాలు అనేకం ఉన్నాయి. అలా మన్మధుడు మూవీని కూడా మొదట నాగార్జునని కాకుండా అప్పటి యంగ్ హీరోని తీసుకోవాలి అనుకున్నారట.అప్పటికే వరుస హిట్స్ తో జోరు మీదున్న హీరోని తీసుకుంటే మన్మధుడు సినిమా చాలా బాగా హిట్ అవుతుంది అని త్రివిక్రమ్ అనుకున్నారట. కానీ ఆ హీరో వేరే సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల నాగార్జునతో చేశారట. ఇక ఆ హీరో ఎవరో కాదు అప్పటి యంగ్ హీరో లవర్ బాయ్ తరుణ్..

 మొదట మన్మధుడు మూవీని తరుణ్ తో చేద్దాం అనుకున్నారట. కానీ అప్పటికే తరుణ్ వేరే సినిమాలకు డేట్స్ ఇవ్వడంతో డేట్స్ ఖాళీగా లేక రిజెక్ట్ చేశారట. ఇక అదే సమయంలో ఈ సినిమా నాగార్జునకే సెట్ అవుతుంది అని ఆయన దగ్గరికి వెళ్లి కథ చెప్పగా నాగార్జునకి నచ్చేసిందిట. కథ బాగా నచ్చిన నాగార్జున నేనే స్వయంగా నిర్మిస్తాను అని చెప్పి మన్మధుడు సినిమాకి ఆయనే నిర్మాతగా కూడా చేశారు. అలా ఈ సినిమా 2002లో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలా తరుణ్ మిస్ చేసుకోవడంతో మన్మధుడు మూవీతో నాగార్జున హిట్ కొట్టారు

మరింత సమాచారం తెలుసుకోండి: