మీనాక్షి చౌదరి ..ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారడానికి ట్రై చేస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 100 కోట్ల హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . అయినా ఏం అదృష్టం ఆమె అనుకున్న రోల్స్ ఆమెకు రావడం లేదు.  అన్నీ కూడా తూతూ మంత్రంగా గ్లామరస్ పాత్రలే వస్తున్నాయి . మీనాక్షి చౌదరి మొదటి నుంచి చాలా చాలా డిఫరెంట్ మైండ్ సెట్ గల అమ్మాయి . తాను అనుకున్నా రోల్ వచ్చేవరకు దానికోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది . సాధారణంగా హీరోయిన్స్ తాము అనుకున్న రోల్స్  రాకపోతే వచ్చిన రోల్స్ తో కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు .


కానీ మీనాక్షి చౌదరి మాత్రం దానికి డిఫరెంట్.  వేరే రోల్స్ కోసం కాంప్రమైజ్ అవుతూ తాను అనుకున్న రోల్స్  కోసం కష్టపడుతుంది . అయితే మీనాక్షి చౌదరికి ఎందుకు ఇండస్ట్రీలో పెద్ద అవకాశాలు రాలేకపోతున్నాయి అంటే మాత్రం ఆమె మరీ సన్నగా ఉండడం .. మరి ఆమె అటూ ఇటూ కాకుండా హైట్ ఏ హీరోకి సెట్ కాకుండా ఉండటమే అంటున్నారు జనాలు.  మీనాక్షి ఫ్యాన్స్ కూడా ఇదే విషయాన్ని ఒప్పేసుకుంటున్నారు . హీరోయిన్స్ స్లిం గా ఉండడం మంచిదే . కానీ మీనాక్షి చౌదరి మరి స్లిమ్ గా ఉంటుంది అని..



 బక్కపలచిన బ్యూటీ అని ..మీనాక్షి చౌదరి కొందరికి హీరోల పక్కన హీరోయిన్ గా సూట్ అవ్వదు అని..  ఆ కారణంగానే పాన్ ఇండియా స్టార్స్ ఆవిడని సినిమాలో తీసుకోవాలి అంటే భయపడుతున్నారు అని మాట్లాడుతున్నారు. దీంతో మీనాక్షి చౌదరికి అయోమయ సిచువేషన్ ఎదురైన పరిస్థితి వచ్చింది.  ఇప్పుడు మీనాక్షి చౌదరి సినిమాల కోసం బరువు పెరుగుతుందా..? లేదా..? ఏమో కొన్నాళ్లు వెయిట్ చేస్తే దానికి ఆన్సర్ దొరికేసేయొచ్చు. మొత్తానికి ఆమె అందమే ఆమెకి నెగిటివ్ గా మారింది అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: