తెలుగులో మంచి గుర్తింపు పొందిన సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ మూవీలలో హిట్ సిరీస్ ముందు వరసలో ఉంటుంది. మొదటగా హిట్ సిరీస్ నుండి హిట్ ది ఫస్ట్ కేస్ అనే టైటిల్ తో దర్శకుడు శైలిష్ కొలను విశ్వక్ సేన్ హీరోగా మూవీ ని రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ మూవీ తర్వాత శైలేష్ "హిట్ ది సెకండ్ కేస్" అనే టైటిల్ తో అడవి శేషు హీరో గా మూవీ ని రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇకపోతే శైలిష్ కొలను తాజాగా హిట్ సిరీస్ నుండి నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్గా హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమాను మే 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ , హిట్ ది సెకండ్ కేస్ మూవీలు మంచి విజయాలను సాధించి ఉండడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే నార్త్ అమెరికాలో ఈ మూవీ కి ప్రీమియర్స్ ప్రీ సేల్స్ ద్వారానే అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ ప్రీ సేల్స్ ద్వారానే 350 కే ప్లస్ కలెక్షన్లు దక్కినట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఇకపోతే ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఎలాంటి టాక్ ను తెచ్చుకుని ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: