సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఒక్క తమిళనాడు కాదు మొత్తం సౌత్ ఇండియాలోనే ఎంతో ఫేమస్ అయిన వ్యక్త రజినీకాంత్. తన నటనతో రజినీకాంత్ ప్రేక్షకుల మనసులను తన సొంతం చేసుకున్నారు. రజనీకాంత్ సినిమా రిలీజవుతుందంటే చాలు ప్రేక్షకులకు పండుగానే చెప్పాలి. అయితే రజినీకాంత్ చాలా సినిమాలలో చాలా మంచి పాత్రలలో నటించారు.  

అయితే సూపర్ స్టార్ రజినీకాంత్  ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరు. మరి ఆయన మొదటి పారితోషకం ఎంతో తెలుసా. రజినీ కాంత్ మొదటి సినిమా అపూర్వ రాగంగళ్. ఈ సినిమాను 1975లో తెరకెక్కించారు. ఈ సినిమాతోనే రజినీ కాంత్ సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. ఈ మూవీకి సూపర్ స్టార్ ఎంత పారితోషికం తీసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు. ఆయనకు ఈ సినిమా చేసినందుకు రూ. 100 పారితోషికం తీసుకున్నారు అంట. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఇప్పుడు స్టార్ హీరో రజినీకాంత్.. అంతా తక్కువ పారితోషికం తీసుకున్నారా అంటున్నారు. 

ఇక రజినీకాంత్ అంటే కేవలం తమిళంలో మాత్రమే కాదు.. తెలుగులోనూ తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నాడు. 7 పదుల వయసులోనూ ఇండస్ట్రీ హిట్ రికార్డులు తిరగరాయడం ఒక్క సూపర్ స్టార్ రజినీకాంత్ కే చెల్లింది. అంతేకాదు.. ఆయన ఇండియన్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో టాప్ 5 ప్లేస్‌లలో ఉన్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ ఒక్కో సినిమాకు అక్షరాల రూ.180 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న కూలీ సినిమా చేస్తున్నాడు. అక్కినేని నాగార్జున కీలక రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: