రామ్ చరణ్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ . అయితే ఇప్పుడు అలా ఎవరు పిలవడం లేదు . గ్లోబల్  స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న గ్లోబల్ స్టార్.  దానికి పూర్తి కారణం రాజమౌళి అనే చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారానే ఇంత పాపులారిటి సంపాదించుకున్నాడు రామ్ చరణ్ అని చెప్పుకోవడంలో సందేహమే లేదు . ప్రజెంట్ "పెద్ది" సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు బుచ్చిబాబు సన . ఉప్పేనా లాంటి  సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని మరీ రామ్ చరణ్ తో "పెద్ది" సినిమాకు కమిటీ అయ్యాడు .


ఈ సినిమాను చాలా కేర్ఫుల్ గా తెరకెక్కిస్తున్నాడు బుచ్చిబాబు సన.  ఈ సినిమాతో రామ్ చరణ్ కి మరో స్టార్ హిట్ ఇవ్వడం కన్ఫామ్ అంటున్నారు జనాలు . అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం చాలామంది బ్యూటీస్ ని అప్రోచ్ అవుతున్నారట బుచ్చిబాబు సన.  ముందుగా రష్మిక మందన్నాను అడిగారట . ఆమె రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత అలియా భట్ ని అడిగారట. ఆమె కూడా రిజెక్ట్ చేశారట. ఆ తరువాత కాజల్ అగర్వాల్ ని ఫైనలైజ్ చేసారట . కాజల్ అగర్వాల్ -  రామ్ చరణ్ స్వయంగా రిజెక్ట్ చేశారట.



ఆల్రెడీ గతంలో కాజల్ కి రాంచరణ్ కి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు గుప్పుమన్నాయి. పైగా ఇప్పుడు కాజల్  ఆంటీ లుక్స్ లో కనిపిస్తుంది. అలాంటి హీరోయిన్ నా సినిమాలోనా అంటూ రిజెక్ట్ చేసారట . అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ శ్రీలీల అయితే బాగుంటుంది అంటూ స్వయానా సజెస్ట్ చేసారట . ఆశ్చర్యం ఏంటంటే శ్రీ లీల కూడా ఐటమ్ సాంగ్ చేయడానికి ఓకే చేసిందట . పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసినందుకే జనాలు బూతులు తిట్టారు.  ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఆమె సిగ్నల్ ఇచ్చి తప్పు చేసింది అంటున్నారు అభిమానులు.  ఇలా అన్ని ఐటెం సాంగ్స్ చేసుకుంటూ పోతే లాస్ట్ కి ఐటం గర్ల్ గా మిగిలిపోతావ్ అంటూ హెచ్చరిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: