ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు బుచ్చిబాబు సనా. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో మొదటి సినిమా ఉప్పెన చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు బుచ్చిబాబు సనా. ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన రెండవ సినిమాతోనే ఏకంగా గ్లోబల్ స్టార్ తో చేసే అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ డైరెక్టర్ కి మరో స్టార్ హీరోతో చేసే అవకాశం వచ్చిందని సమాచారం.

ఆయన ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు.  ప్రస్తుతం మహేష్ బాబు ఎస్ ఎస్ ఎం బి 29 అనే వర్కింగ్ టైటిల్ తో రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మహేష్ బాబు ఎవరితో సినిమా చేయబోతున్నారు అని పలువురు దర్శకుల పేర్లు కూడా తెరపైకి రాగా..  బుచ్చిబాబు సనాకి ఆ అవకాశం లభించినట్లు సమాచారం.  అసలు విషయంలోకి వెళ్తే.. మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే  సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించారు.  అప్పటికి ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న బుచ్చిబాబు ఈ సినిమా కోసం పనిచేశారు. అలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది.  ఉప్పెన సినిమా తర్వాత ఒక కథను రెడీ చేసుకుని మహేష్ బాబును కలిసారట బుచ్చిబాబు. దాంతో మహేష్ బాబు ఏదైనా మంచి కథ ఉంటే చెప్పు సినిమా చేద్దామని అప్పుడే బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే తన దగ్గర ఉన్న కథ కంటే ఇంకాస్త బెటర్ గా ఒక యాక్షన్ డ్రామా కథను రాసుకొచ్చారట. నిత్యం తన దగ్గర చాలా కథలు ఉన్నాయని చెబుతూ ఉండే బుచ్చిబాబు ఇప్పుడు మహేష్ బాబు కోసం ఒక కొత్త స్టోరీని రూపొందించి మరీ చెప్పారట. మహేష్ ఇప్పుడు రాజమౌళి సినిమా చేస్తున్నాడు కాబట్టి అటు రామ్ చరణ్ తో బుచ్చిబాబు సినిమా చేస్తున్నారు ఈ రెండు సినిమాలు పూర్తి అయిన వెంటనే మహేష్ బాబు కూడా బుచ్చిబాబుకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా మహేష్ బాబుతో అవకాశం ఉంటే ఇతడి అదృష్టం మామూలుగా లేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: