
తొలి రోజు శుభం వరల్డ్ వైడ్ గా 1.5 కోట్లు వచ్చినట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు . చిన్న సినిమా అయినా సరే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతుంది అని .. నిజంగా ఇది చాలా చాలా గర్వకారణం అంటూ మూవీ టీం చెప్తుంది . వీకెండ్ కావడంతో ఈ మూవీకి వసూళ్లు మరింత పెరిగే ఛాన్సెస్ ఉంది అంటూ కూడా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి ఈ మధ్య కాలంలో పెద్ద స్టార్ హీరోలు నటించిన సినిమాలు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ అందుకోలేకపోతున్నారు. సమంత చిన్న స్టార్స్ తో నిర్మించిన సినిమా ఈ రేంజ్ లో హిట్ అవ్వడం తో ఇప్పుడు జనాలు ఆమె నెక్స్ట్ సినిమాపై ఫోకస్ చేస్తున్నారు.
కాగా హీరోయిన్ గా తన కెరీర్ పిక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకున్న సమంత ఆ తర్వాత ఎలా ఊహించని చిక్కుల్లో ఇరుక్కుందో అందరికీ తెలిసిందే. భర్తకు డివర్స్ ఇవ్వడం .. తర్వాత ఆరోగ్యం బాగోలేక పోవడం.. నాన్నను కోల్పోవడం అన్నీ ఎదురు దెబ్బలు తగిలాయి. ఇప్పుడిప్పుడే సమంత వాటి నుంచి బయటపడుతూ కోలుకుంటూ సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేస్తూ వస్తుంది. ఆమె నిర్మించిన శుభం సినిమా ఇంత పాజిటివ్ టాక్ దక్కించుకోవడంతో సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . ఈ సినిమా సమంతకి మంచి పాజిటివ్ రిజల్ట్ ఇచ్చిందని ..ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు నిర్మించాలి అని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.