సినిమా ఇండస్ట్రీ లో ఏదైనా మూవీ విడుదల అయింది అంటే ఆ సినిమాకు మొదట ప్రమోషన్స్ అనేది చాలా ముఖ్యం. ఏదైనా స్టార్ హీరో నటించిన సినిమాకు పెద్ద స్థాయిలో ప్రమోషన్లు చేయకపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ చిన్న హీరోలు , మీడియం రేంజ్ హీరోలు నటించిన సినిమాలకు ప్రమోషన్స్ అనేది అత్యంత ముఖ్యం. ఎందుకు అంటే వారు నటించిన సినిమాలకు మంచి ప్రమోషన్స్ జరిగినట్లయితే ఆ మూవీలకు మొదట రోజు పెద్ద ఎత్తున జనాలు థియేటర్లకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అదే మూవీ కి మంచి మౌత్ టాక్ జనాల నుండి వచ్చినట్లయితే ఆ మూవీ కి మొదటి రోజు కంటే ఆ తర్వాత అద్భుతమైన కలెక్షన్స్ వస్తూ ఉంటాయి.

ఇక తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి శ్రీ విష్ణు "సింగిల్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కేతికా శర్మ ,  ఇవానా హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ తాజాగా మే 9 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను ఈ మూవీ బృందం పెద్ద ఎత్తున చేసింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు మంచి ఓపెనింగ్లు లభించాయి. ఇక ఈ మూవీ కి మంచి ఓపెనింగ్లు లభించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన మౌత్ టాక్ కూడా వచ్చింది. దానితో ఈ సినిమాకు మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మూవీ కి బుక్ మై షో ఆప్ లో మొదటి రోజు జరిగిన బుకింగ్స్ కంటే రెండవ రోజు ఎక్కువగా జరిగాయి. ఈ మూవీ కి మొదటి రోజు బుక్ మై షో ఆప్ లో 50.7 కే టికెట్లు సేల్ కాగా , రెండో రోజు 80.9 కే టికెట్స్ సేల్ అయ్యాయి. ఈ మూవీ కి మొదటి రోజు అద్భుతమైన మౌత్ రావడంతో రెండవ రోజు ఈ సినిమా టికెట్ సేల్స్ అద్భుతంగా పెరిగినట్లు అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sv