చిరంజీవి తన సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారు. అందులో ఒకటే చంటబ్బాయి సినిమాలో ఆయన పోషించిన లేడీ గెటప్. ఈ సినిమాలో సాంగ్ చేస్తున్నప్పుడు చార్లీ చాప్లిన్ పాత్రలో అలాగే లేడీ గెటప్ పాత్రలో చిరంజీవి నటించాల్సి ఉంటుంది. అయితే అప్పటివరకు మాస్ హీరోగా ఇండస్ట్రీలో యంగ్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి ఇలాంటి ఓ పాత్రకు ఒప్పుకున్నారంటే సాహసమే అని చెప్పాలి.అంతేకాదు కామెడీ సినిమాలు చేసే జంధ్యాల కి ఈయన సినిమా ఓకే చేయడం కూడా ఒక పెద్ద ఆశ్చర్యమే అని చెప్పుకోవచ్చు.ఎందుకంటే అప్పట్లో చిరంజీవి హీరోగా మంచి ఫామ్ లో ఉన్నాడు.దాంతో దర్శకులు అందరూ ఈయనతో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు.అలాంటి సమయంలో జంధ్యాలతో చంటబ్బాయి సినిమా చేయడానికి ఒప్పుకున్నారు చిరంజీవి.

అయితే ఈ సినిమాలో చిరంజీవి ఓ పాట కోసం లేడీ గెటప్ వేయాల్సి ఉంటుంది.అందులో గౌన్ వేసుకొని విగ్గు పెట్టుకొని చిరంజీవి నటించాల్సి ఉంటుంది. అయితే ఈ లేడీ గెటప్ వేసుకోవడానికి చిరంజీవి ఓకే చెప్పారట. అయితే లేడీ గెటప్ కోసం మీసాలు తీసేయమని డైరెక్టర్ చెప్పడంతో ఓకే చెప్పారట. ఓకే చెప్పడంతో పాటు ఒక కండిషన్ కూడా పెట్టారట. అదేంటంటే సినిమా షూటింగ్ సెట్లో దాదాపు 70, 80 మంది మగవాళ్ళు ఉంటారు. ఆ మగాళ్లు అందరూ మీసాలు తీసేసి వస్తేనే నేను కూడా మీసం తీసేస్తా అని కండిషన్ పెట్టారట.

 ఇక చిరంజీవి పెట్టిన కండిషన్ కి తలొగ్గి షూటింగ్ సెట్ కి వచ్చిన ఆ 80 మంది మగవాళ్లు మీసం తీసేయడంతో చిరంజీవి కూడా మీసం తీసేసారట. ఇక చంటబ్బాయి సినిమాలోని లేడీ గెటప్ లో చిరంజీవి అద్భుతంగా చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక చిరంజీవి మీసాలు తీసేస్తే అస్సలు బాలేరు.దాంతో ఇంట్లో వాళ్ళందరూ మీసాలు వచ్చేవరకు మళ్ళి మాకు కనిపించకండి అని అన్నారట. అయితే ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ ఈవెంట్ లో చెప్పారు. ఇక చిరంజీవి ఇప్పటివరకు పట్నం వచ్చిన పతివ్రతలు,చంటబ్బాయ్ ఈ రెండు సినిమాల్లో లేడీ గెటప్ లో నటించారు

మరింత సమాచారం తెలుసుకోండి: