మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా  మేడమ్ టుస్సాడ్స్ లో ఏర్పాటు చేసిన తన మైనపు బొమ్మ విగ్రహావిష్కరణ కోసం లండన్ వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. అయితే తన మైనపు బొమ్మ విగ్రహావిష్కరణ చేశాక ఆ విగ్రహంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఫోటోలు దిగింది.ముఖ్యంగా క్లీంకారా తన తండ్రి విగ్రహాన్ని చూసి తండ్రే కావచ్చు అని దగ్గరికి వెళ్లిన క్యూట్ వీడియో కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది. అయితే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రామ్ చరణ్ తన పెద్ది మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.ముఖ్యంగా ఆ సినిమా కంటే ఇది చాలా బెటర్ గా ఉంటుంది అని మాట్లాడి పెద్ద సినిమాపై భారీ హైప్ పెంచేశారు. మరి ఇంతకీ ఆ కార్యక్రమంలో రామ్ చరణ్ ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం..రామ్ చరణ్ ఆ ఈవెంట్ లో మాట్లాడుతూ.. పెద్ది మూవీ షూటింగ్ ఇప్పటికే 30% పూర్తయింది. 

సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది నన్ను నమ్మండి. ముఖ్యంగా రంగస్థలం సినిమా కంటే పెద్ది మూవీనే అద్భుతంగా ఉంటుంది నన్ను నమ్మండి అంటూ ఆ కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక పెద్ది మూవీ పై రామ్ చరణ్ చేసిన కామెంట్లను మెగా ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం రంగస్థలం కంటే పెద్ది సినిమా బాగుంటుంది అని రామ్ చరణ్ గొప్పలు చెప్పుకుంటున్నారా ఏంటి అని విమర్శిస్తున్నారు. ఎందుకంటే శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా సమయంలో కూడా రామ్ చరణ్ ఇలాగే సినిమాపై భారీ భారీ డైలాగులు కొట్టారు. కానీ తీరా సినిమా విడుదలయ్యాక రిజల్ట్ ఎలా ఉందో చెప్పనక్కర్లేదు.

 ఇక రామ్ చరణ్ ఇప్పటివరకు నటించిన సినిమాలన్నింటిలో మెగా ఫ్యాన్స్ కి ఎక్కువగా ఇష్టమైన సినిమాలలో ఫస్ట్ ప్లేస్ లో రంగస్థలం సినిమానే ఉంటుంది. అలాంటి రంగస్థలం సినిమా కంటే పెద్ది మూవీ బాగుంటుంది అని రామ్ చరణ్ చెప్పడంతో కొంతమంది రామ్ చరణ్  తను నెక్స్ట్ సినిమాపై గొప్పలు చెప్పుకుంటున్నాడు అంటూ విమర్శిస్తున్నారు. ఇక బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: