టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టిన కొత్తలో వరస పెట్టి భారీ విజయాలను అందుకుంటూ వచ్చాడు. దానితో చాలా తక్కువ కాలంలోనే ఈ దర్శకుడు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన స్థాయికి చేరుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం పూరి జగన్నాథ్ కి అద్భుతమైన విజయాలు దక్కడం లేదు. ఆఖరుగా ఈయన దర్శకత్వం వహించిన లైగర్ , డబుల్ ఈస్మార్ట్ మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాలను ఎదుర్కొన్నాయి.

ఇది ఇలా ఉంటే పూరి జగన్నాథ్ తన తదుపరి మూవీ ని తమిళ నటుడు అయినటువంటి విజయ్ సేతుపతి తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ లో టబు , నివేదా థామస్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ కేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో మరో ఇంపార్టెంట్ పాత్ర ఉన్నట్లు , అందులో ఓ క్రేజీ నటుడిని తీసుకోవాలి అని పూరి జగన్నాథ్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... పూరి జగన్నాథ్ తనయుడు అయినటువంటి ఆకాష్ పూరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే పూరీ జగన్నాథ్ , విజయ్ సేతుపతి తో చేయబోయే సినిమాలో ఒక ఇంపార్టెంట్ పాత్రలో ఆకాష్ పూరి ని తీసుకోవాలి అనుకుంటున్నాట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి పూరి జగన్నాథ్ , విజయ్ సేతుపతి కాంబోలో రూపొందబోయే సినిమాకు సంబంధించి వస్తున్న ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉన్నది అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: